Friday, 7 August 2026

ఉక్రెయిన్ అధ్యక్షుడికి భారీ షాకిచ్చిన ట్రంప్.. మిలిటరీ సాయం నిలిపివేత.. 

వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వాగ్వివాదానికి దిగిన ట్రంప్.. తాజాగా భారీ షాకిచ్చారు. ఉక్రెయిన్‌కు అందించే మిలిటరీ సాయాన్ని తాత్కాలికంగా నిలివేస్తున్నట్టు ప్రకటించారు. రష్యాతో శాంతి చర్యల కోసం ఉక్రెయిన్‌పై మరింతగా ఒత్తిడి పెంచేందుకు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ భద్రతకు తగిన హామీలు లభిస్తేనే రష్యాతో చర్చలకు అంగీకరిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు కొంతకాలంగా పట్టుబడుతున్న విషయం తెలిసిందే.

ఉక్రెయిన్‌కు సాయం నిలిపివేతపై అంతకుముందే డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. సాయం నిలిపివేతను కొట్టిపారేయలేమని విలేకరులు అడగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. జెలెన్‌స్కీ తీరును ఎక్కువ కాలం సహించబోనని, అమెరికా చేస్తున్న ఆయన కృతజ్ఞత చూపాలని కూడా అన్నారు. రష్యాతో కాల్పుల విరమణ ఒప్పందం లేకుండా జెలెన్‌స్కీ ఎక్కువ కాలం మనలేరని కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు.

తాను శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నానని జెలెన్‌స్కీ కూడా సోమవారం స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా యుద్ధం ముగింపునకు ప్రయత్నిస్తున్నానని అన్నారు. అయితే, రష్యా మాత్రం ఈ విషయంలో నిబద్ధత ప్రదర్శించట్లేదని విమర్శించారు. తమ భద్రతకు కచ్చితమైన హామీలు లభించడమే ఈ యుద్ధానికి ముగింపు అని అన్నారు.

యుద్ధ విరమణకు అమెరికా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఐరోపా దేశాలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కనీసం ఒక నెల పాటు ఇరు దేశాల మధ్యా కాల్పుల విరమణ కోసం బ్రిటన్, ఫ్రాన్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. యుద్ధ విరమణ ఇంకా చాలా దూరంలో ఉందని, శాంతి స్థాపన దిశగా ఇవి తొలి అడుగులు మాత్రమేనని అన్నారు. ఉక్రెయిన్ భద్రతకు సంబంధించి స్పష్టమైన హామీలు దక్కినప్పుడే నిజమైన శాంతి స్థాపన జరుగుతుందని జెలెన్‌స్కీ సోమవారం ఓ వీడియో సందేహంలో అన్నారు. ఇలాంటి హామీలు లేని కారణంగానే రష్యా 11 ఏళ్ల క్రితం ఉక్రెయిన్‌పై దాడి చేసి క్రిమియాను ఆక్రమించుకోగలిగిందని గుర్తు చేశారు. చివరకు రష్యా పూర్తిస్థాయి యుద్ధానికి తెరతీసేలా అవకాశం ఇచ్చిందని చెప్పుకొచ్చారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు