Friday, 7 August 2026

తెలంగాణ సర్కార్ కు సుప్రీం కోర్టు నోటీసులు…

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు నేడు సుప్రీం కోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. బీఆర్ఎస్ బీ ఫారం మీద గెలిచి, అధికార పార్టీలోకి మారిన 10 ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం.. స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధుల పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తే ఇంక విలువలు ఏముంటాయని స్పీకర్ ను ప్రశ్నించింది. అయితే దీనిపై స్పందించిన స్పీకర్ తరపున న్యాయవాది.. ఇప్పటి వరకు తమకు నోటీసులు అందలేదని కోర్టుకు తెలిపారు. వీరి వాదన పరిగణలోకి తీసుకొని ఈ కేసులో ప్రతివాదులైన అసెంబ్లీ సెక్రెటరీ, స్పీకర్, రాష్ట్రప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైకోర్ట్ రిజిస్ట్రార్ కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసులకు మార్చ్ 22 లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం మార్చ్ 25కు వాయిదా వేసింది. అయితే తమ పార్టీ బీ ఫారం మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్ట్ సింగిల్ బెంచ్.. ఆ 10 మంది ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్ట్ సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ.. అసెంబ్లీ సెక్రెటరీ ప్రత్యేక బెంచ్ కు అప్పీల్ చేసుకోగా.. అనర్హులుగా ప్రకటించేందుకు ఎంత సమయం తీసుకోవాలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. కాగా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు