Friday, 7 August 2026

తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లల్లో ఒకటవ తరగతి నుండే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్

రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచే కృత్రిమ మేధ(ఏఐ) పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు గణితంలో ఒక పాఠంగా ఏఐని చేర్చేందుకు చర్యలు చేపట్టింది. 1-5 తరగతుల వరకు 2-3 పేజీల్లో… ఆరు నుంచి 9వ తరగతి వరకు 4-5 పేజీల్లో ఏఐ పాఠ్యాంశం ఉండనుంది. పాఠశాల విద్యాశాఖలోని ఓ అదనపు సంచాలకుడు, ఎస్సీఈఆర్ సబ్జెక్టు నిపుణులతో ఏఐ పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారు. ఇవి సిద్ధమయ్యేందుకు 15-20 రోజులు పట్టవచ్చని భావిస్తున్నారు.

కంప్యూటర్, ఏఐ పుట్టుపూర్వోత్తరాలు, ప్రస్తుతం ఎక్కడ వినియోగిస్తున్నారు? కొన్ని ఉదాహరణలు చేర్చనున్నారు. సీబీఎస్ఈలో దాదాపు నాలుగేళ్ల క్రితమే ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏఐ పాఠాలు చేర్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు.. మెరుగైన అభ్యసన పద్ధతుల కోసం బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఏక్స్టెప్ ఫౌండేషన్ సహకారంతో ఏఐ టూల్స్, ప్లాట్ఫాంలను ప్రవేశపెట్టాలని రాష్ట్ర సర్కారు ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు