Friday, 7 August 2026

నాగబాబుకు మంత్రి పదవికి బదులు ఎంపీ పదవి…!

మెగా బ్రదర్ నాగబాబుకు ముఖ్యమైన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ఆయన్ను ఎమ్మెల్సీని చేసి కేబినెట్‌లోకి తీసుకోవాలని భావించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల్లో ఒక స్థానం ఇస్తారనుకున్నారు. మారిన పరిస్థితులతో నాగబాబుకు కేబినెట్‌ హోదా ఉండే కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి అయితే బావుంటుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎంపీ పదవి వచ్చేలోపు.. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేలా కీలకమైన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవిలో నియమించనున్నట్లు సమాచారం.

పార్టీ భవిష్యత్ వ్యూహాన్ని దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా జనసేనకు సామాజిక సమతుల్యతను అందించేందుకు ఈ మార్పు అవసరమని పవన్ భావించినట్టు తెలుస్తోంది.గతంలోనూ నాగబాబు రాజ్యసభ స్థానాన్ని ఆశించారు. కానీ అప్పటి పరిస్థితులు అనుకూలించకపోవడంతో, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మరో మలుపు తిరిగాయి. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారాయి. ఇటీవల వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారం మొదలైంది. అయితే జనసేన వర్గాల్లో మాత్రం నాగబాబుకు ఆ అవకాశం ఇవ్వాలనే వాదన బలంగా వినిపిస్తోంది.రాజ్యసభ వచ్చేలోపు కేబినెట్ హోదా ఉండే కార్పొరేషన్ పదవిని నాగబాబుకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం తిరుగుతూ, పర్యావరణానికి అనుకూలంగా ఉండే పదవిని నాగబాబుకు ఇవ్వమని ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కళ్యాణ్ కోరినట్టు సమాచారం.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు