Friday, 7 August 2026

కాంగ్రెస్ పార్టీలో రెడ్ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోరు: మధుయాష్కీ గౌడ్

కాంగ్రెస్ పార్టీపై సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్లు, అగ్రకులాల వాళ్లు ఎలాంటి క్రమశిక్షణ ఉల్లంఘన పనులు చేసినా చర్యలు తీసుకోరు అని మ‌ధుయాష్కీ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డే క్రమశిక్షణ తప్పాడని ఆయ‌న పేర్కొన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే మేఘా రెడ్డిపై బహిరంగంగా ఆరోపణలు చేశాడు.. మరి క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిపై క్రమశిక్షణ చర్యలు ఉండవా? అని ప్ర‌శ్నించారు. కులగణన మీద బీసీ నాయకులతో రేవంత్ రెడ్డి మీటింగ్ పెడితే దానికి జానారెడ్డిని, కేశవరావును పిలిచారు కానీ బీసీ నాయకుడినైనా నన్ను పిలవలేదు అని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను ఇటీవ‌లే స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. రాహుల్ గాంధీ ఆదేశాల మేర‌కే పార్టీ నుంచి ఎమ్మెల్సీ మ‌ల్ల‌న్న‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ప‌లు స‌భ‌ల్లో రెడ్ల‌ను తీన్మార్ మ‌ల్ల‌న్న బ‌హిరంగంగా విమ‌ర్శించిన నేప‌థ్యంలోనే ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన‌ట్లు రాజ‌కీయ నిపుణులు పేర్కొన్నారు. పార్టీ వ్య‌తిరేక కార్యక‌లాపాల‌కు పాల్ప‌డినందుకే స‌స్పెండ్ చేసిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ సంఘం తెలిపింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు