Friday, 7 August 2026

ఏప్రిల్ 2 నుండి భారత్ చైనా మీద సుంకాలు : కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ, ఏప్రిల్ 2, 2025 నుండి భారత్, చైనా వంటి పలు దేశాలపై సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. అమెరికా దిగుమతులపై ఈ దేశాలు అధిక సుంకాలు విధిస్తున్నాయని, అందుకు ప్రతిగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇండియా అమెరికా ఉత్పత్తుల మీద 100% కి పైగా టారీఫ్స్ విధించింది. అమెరికాను సంపన్నంగా మార్చటానికి ఇవి తోడ్పడతాయి అని పేర్కొన్నాడు.

ఫిబ్రవరి 2న, చైనా నుండి దిగుమతి అయ్యే వస్తువులపై 10% సుంకాలు విధిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి ప్రతిగా, చైనా కూడా అమెరికా దిగుమతులపై 10% నుండి 15% వరకు సుంకాలు విధించింది. ఇటీవల, ఫిబ్రవరి 12-13 తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా సందర్శించి, అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వలస, వాణిజ్య సంబంధాలు, భద్రతా పరికరాల కొనుగోలు వంటి అంశాలు చర్చించబడ్డాయి. ఈ పరిణామాలు ప్రపంచ వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్, చైనా వంటి దేశాలు తమ వాణిజ్య విధానాలను పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు