Friday, 7 August 2026

అమెరికా విధించే సుంకాల వలన UK వినియోగదారులకు ఇబ్బందులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల వల్ల UK వినియోగదారుల జేబులకు చిల్లుపడే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నిపుణులు హెచ్చరించారు. సుంకాలు అభివృద్ధిని దెబ్బతీస్తాయని, UK మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు పెద్దమొత్తంలో ఇబ్బందులను కలిగిస్తాయని బ్యాంక్ గవర్నర్ ఆండ్రూబెయిలీ అన్నారు.

యుఎస్‌లోకి వెళ్లే యూకే వస్తువులపై సుంకాలు విధించినట్లయితే, ఇది యూకే ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుంది. ఎందుకంటే సంస్థలు యుఎస్ వినియోగదారులకు విక్రయించడం కష్టతరం అవుతుంది. కానీ అది ద్రవ్యోల్బణాన్ని, ధరలు పెరిగే వేగాన్ని కూడా తగ్గించగలదు. సప్లై చైన్ దెబ్బతిన్నట్లయితే, వాటిని తిరిగి క్రమబద్ధీకరించాల్సివస్తే, అది UK వృద్ధిని దెబ్బతీస్తుంది మరియు ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది.

కొన్ని ముఖ్యమైన ప్రభావాలు గమనిస్తే ఎగుమతుల ఖర్చు పెరుగుతుంది. బ్రిటన్‌ నుండి అమెరికాకు ఎగుమతిచేసే ఉత్పత్తులపై టారీఫ్‌లు పెరిగితే, బ్రిటన్ కంపెనీల ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో ఖరీదైనవిగా మారుతాయి. ఉద్యోగాలు ప్రభావితమవుతాయి. అమెరికాలో బ్రిటన్ ఉత్పత్తుల డిమాండ్ తగ్గితే, బ్రిటన్‌లోని కొన్ని పరిశ్రమలు ఉద్యోగాలను కోల్పోయేప్రమాదం ఉంది.

వినియోగదారులపై భారం, టారీఫ్‌లు ఉత్పత్తుల ధరలను పెంచుతాయి. దీనివల్ల అమెరికా వినియోగదారులు బ్రిటన్ వస్తువుల కోసం ఎక్కువ ధరలు చెల్లించాల్సిరావచ్చు. ఇదే విధంగా బ్రిటన్ కూడా ప్రతిస్పందనగా అమెరికా ఉత్పత్తులపై టారీఫ్‌లు విధిస్తే, బ్రిటన్ వినియోగదారులకు అమెరికా ఉత్పత్తులు ఖరీదైనవిగా మారతాయి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు