మహారాష్ట్రలో 2022లో మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ (Rahul Gandhi).. వీర్ సావర్కర్ బ్రిటిష్ సేవకుడని, వారి నుంచి పింఛను కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు స్వాతంత్య్ర సమర యోధుడైన వీర్ సావర్కర్ ను కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ నృపేంద్ర పాండే అనే వ్యక్తి యూపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విషయంలో పదే పదే విచారణకు గైర్హాజరు అవుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీకి ఉత్తర్ ప్రదేశ్ లోని న్యాయస్థానం రూ.200 జరిమానా విధించింది. ఏప్రిల్ 14న తదుపరి విచారణకు
హాజరు కాకుంటే మాత్రం తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది.
సావర్కర్ పై వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి (Rahul Gandhi) జరిమానా…


