Friday, 7 August 2026

RGV (Ram Gopal Varma) కి ఏపీ హైకోర్టులో భారీ ఊరట

సీఐడీ పోలీసులు నమోదు చేసిన ఓ కేసుపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. Ram Gopal Varma ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సంబంధించి న‌మోదైన కేసులో విచార‌ణ‌పై హైకోర్ట్ స్టే విధించింది. 2019లో విడుదలైన సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయడమేంటని కోర్టు ప్రశ్నించింది.

గుంటూరు CID పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు రామ్‌గోపాల్‌ వర్మ. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమా తీశారంటూ వర్మపై గతంలో ఫిర్యాదులు అందాయి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి తీయ‌డంతో పాటు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయ‌ని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఆర్జీవీపై మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు కంప్లైంట్‌ చేశారు. ఈ ఫిర్యాదును స్వీక‌రించిన సీఐడీ పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇవ్వ‌డంతో పాటు విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని కోరారు. అయితే సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

అయితే ఈ పిటిష‌న్‌కి సంబంధించి ఆర్జీవీ తరపు న్యాయవాదులు నేడు త‌మ వాదన వినిపించారు. 2019లో విడుదలైన సినిమాపై ఇన్నాళ్లకు ఫిర్యాదు చేయడం సమంజసం కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాద‌న‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటి? అని ప్ర‌శ్నించింది. అలాగే ఈ కేసుపై విచారణకు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆర్జీవీపై సీఐడీ తదుపరి చర్యలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు