Friday, 7 August 2026

పిల్లలను కొట్టడం పై పూర్తి నిషేధాన్ని సమర్థించిన ఇంగ్లాండ్ డాక్టర్స్…

ఇంగ్లాండ్‌లో పిల్లలను కొట్టడం పై (smacking) పూర్తి నిషేధాన్ని వైద్యులు సమర్థించారు. బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ (BMA) తాజాగా ఈ నిషేధానికి మద్దతు ప్రకటించింది.

జనవరిలో లేబర్ పార్టీ ఎంపీ జెస్ అసటో ప్రవేశపెట్టిన పిల్లల సంక్షేమం మరియు పాఠశాలల బిల్లు సవరణకు తగినంత మంది ఎంపీలు మద్దతు ఇస్తే, ఇంగ్లాండ్‌లో కొట్టడాన్ని రీసనబుల్ పనిష్మెంట్ గా సమర్థించడం పూర్తిగా నిషేధించబడుతుంది.

నవంబర్ 2020లో కార్పొరల్ పనిష్మెంట్ నిషేధించిన మొదటి UK దేశం స్కాట్లాండ్. ఆ తర్వాత మార్చి 2022లో వేల్స్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 67 దేశాలు ఇప్పటికే కొట్టటాన్ని నిషేధించాయి. అలాగే మరో 20 దేశాలు అలా చేయడానికి కట్టుబడి ఉన్నాయి. పిల్లలను కొట్టడం వలన పాజిటివ్ దృక్పథం వస్తుంది అనటానికి ఎలాంటి ఆధారలు లేవు, అని RCPCH Royal College of Pediatrics and child Health ప్రొఫెసర్ ఆండ్రూ రోలాండ్ అన్నారు.

పిల్లలను కొట్టడం శారీరక శిక్ష (Physical Punishment) కిందకు వస్తుంది. ఇది మానసిక, భావోద్వేగ, ఆచరణాత్మక సమస్యలను పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. స్కాట్లాండ్, వేల్స్ ఇప్పటికే ఈ విధానాన్ని నిషేధించాయి. ఇంగ్లాండ్‌లో కూడా ఇదే చర్య తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు. ఇది బాలల హక్కుల పరిరక్షణకు మరియు ఆరోగ్యకరమైన పెంపకానికి సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు