Saturday, 8 August 2026

కమాండెంట్ ప్రమాదవశాత్తు లిఫ్ట్ లో పడి దుర్మరణం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17వ పోలీస్ బెటాలియన్ లో కమాండెంట్ గా పనిచేసే తోట గంగారాం(58) లిఫ్ట్ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయారు. సిరిసిల్లలో ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే గంగారాం రాత్రి డిన్నర్ చేశాక అర్ధరాత్రి బయటకు వెళ్ళేందుకు లిఫ్ట్ వద్ద వెయిట్ చేశారు. లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లడంతో లిఫ్ట్ లో క్రిందకి పడ్డాడు.,సిరిసిల్లలో నివాసం ఉంటున్న పోలీస్ కమాండెంట్‌ మూడో ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్ బేస్ పై పడడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఫైర్ సిబ్బంది గంటపాటు శ్రమించి లిఫ్ట్ అడుగు భాగంలో పడిపోయిన గంగారం అతి కష్టం మీద తీసి ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు.

లిఫ్ట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కమాండెంట్ గంగారాం స్వస్థలం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం గ్రామం. మృతునికి భార్య రేఖ, ఒక కొడుకు సతీష్ కుమార్ ఇద్దరు కూతుర్లు గౌతమి, మీనల్ ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కు గంగారాం ప్రమాదవశాత్తు లిప్ట్ లో పడి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ మహేష్ బాబా సాహెబ్ గీతే పరామర్శించారు. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు.

అపార్ట్మెంట్ లో నాణ్యతలేని లిఫ్ట్ వల్లే పోలీస్ కమాండెంట్ ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లిఫ్ట్ రాకుండానే డోర్ ఓపెన్ కావడం బిల్డర్ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆందోళన వ్యక్తం అవుతుంది. నాణ్యత లేకుండా సరైన సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా అపార్ట్మెంట్ నిర్మించి లిఫ్ట్ ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బిల్డర్ పై చర్యలు తీసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు