Friday, 7 August 2026

విద్యార్థుల ముందు గుంజీలు తీసిన ప్రధానోపాధ్యాయుడు (Head Master) : ఎందుకు?

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ హైస్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్ల‌ల విద్యా పురోగ‌తి అంతంత‌ మాత్రంగా ఉంద‌ని, చెప్పిన మాట విన‌డంలేదంటూ వారిని దండించలేదు ప్రధానోపాధ్యాయుడు (Head Master) చింత రమణ. పిల్లల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు సరికొత్త ఆలోచనకు నాంది పలికారు. స్కూల్ పిల్లలందరినీ ఒక్క దగ్గర చేర్చి వారి ముందు తనను తాను శిక్షించుకున్నారు. ఆ విద్యార్థుల ముందే గుంజీలు తీశారు హెడ్‌మాస్టర్‌. ప్రస్తుతం హెడ్‌మాస్టర్‌ గుంజీలు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

స్కూల్లో పిల్లలు తప్పు చేస్తే టీచర్లు మందలించడం కామన్. ఒక్కోసారి అల్లరి శృతిమించినా, చదవకపోయినా దండిస్తారు కూడా. కాని ఈ హెడ్‌మాస్టర్‌ ఈ విధంగా చేయడం అనేది ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన పని ఏకంగా విద్యాశాఖమంత్రి లోకేష్ (Minister lokesh) దృష్టికి వెళ్లింది. హెడ్‌మాస్టర్‌ ఆలోచనకు మంత్రి కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన లోకేష్.. “అంతాకలిసి పనిచేద్దాం” అంటూ ప్రధానోపాధ్యాయుడికి సందేశమిచ్చారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు