Friday, 7 August 2026

చెన్నై లో మరో కుటుంబం సామూహిక ఆత్మహత్య…

ఈ సామూహిక విషాదాలకు అంతు ఎక్కడ?

హైదరాబాద్ హబ్సిగుడా ప్రాంతంలో ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మర్చిపోకముందే, చెన్నైలో ఇలాంటిదే మరో సంఘటన గురువారం నాడు చోటుచేసుకున్నది. ఈ మరణాలకు కూడా ఆర్ధిక ఇబ్బందులే కారణంకావడం గమనార్హం.

చెన్నైలోని అన్నానగర్ లో డా.బాలమురుగన్ ఒక స్కాన్ సెంటర్ ని నిర్వహిస్తున్నారు. ఈ స్కాన్ సెంటర్ వల్ల భారీ నష్టాలు వచ్చాయి. ఈ నష్టాలు, ఋణభారం భరించలేక సామూహిక ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. డా.బాలమురుగన్, సిటీ కోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న ఆయన భార్య సుమతి, 12వ తరగతి పరీక్షలు రాస్తున్న 17 ఏళ్ల పెద్ద కుమారుడు దుశ్యంత్, పదవ తరగతి చదువుతున్న 15 ఏళ్ల రెండవ కుమారుడు లింగేష్ ఉరివేసుకొని సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు. నిన్న గురువారం డాక్టర్ బాలమురుగన్ ఇంటికి వారి కార్ డ్రైవర్ వెళ్లినప్పుడు తలుపులు తీయకపోవడంతో అనుమానంతో చుట్టుపక్కలవారిని అప్రమత్తంచేసి కిటికీ తలుపులు తెరిచి చూడగా ఒక గదిలో డా.బాలమురుగన్ దంపతులు, మరో గదిలో వారి ఇద్దరి పిల్లలు ఉరేసుకొని వేలాడుతూ నిర్జీవులుగా కనిపించారు.

సమాచారం అందుకున్న సిటీ పోలీసులు హుటాహుటీన సంఘటనా ప్రాంతానికి చేరుకొని, శవాలను పోస్టుమార్టం నిమిత్తం కిల్పాక్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కి పంపారు.

కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నది. పెద్దలకు వారి వైఫల్యాలు, నిస్పృహలు వారికి ఉండొచ్చు. కానీ పిల్లల్ని కూడా ఎందుకు చంపుకుంటున్నారో, అసలు ఎలా చంపగలుగుతున్నారో లేదా చచ్చిపోవడానికి సిద్ధం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ఈ సంఘటనలో ఆత్మహత్య చేసుకున్నవారు చిన్నవాళ్లేం కారు, విద్యాధికులు. వారిలో ఒకరు డాక్టర్ కాగా, మరొకరు లాయర్. పిల్లలకి 17 ఏళ్లు వచ్చాక, మరొక్క నాలుగైదేళ్లు ఓపిక పడితే వారు వృద్ధిలోకి వస్తారు, ఇబ్బందుల నుండి బైటపడే అవకాశం ఉంటుందనే ఆలోచన కూడా ఆ విద్యాధికులైన దంపతులకి ఎందుకు కలగలేదో అర్ధంకావట్లేదు. తమ ప్రాణాలతోపాటు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోవడానికి వారు కారకులయ్యారు. మనసు కలచివేసే ఇలాంటి విషాదాలు వినపడని రోజుకోసం ఎదురుచూద్దాం.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు