Friday, 7 August 2026

ఏకలవ్యుడు మరోసారి గాయపడ్డాడు…

భారతంలో ఏకలవ్యుడు ఒక్క బొటనవేలే పోగొట్టుకున్నాడు. కానీ తమిళనాడులో అగ్రకుల యువకుల కబడ్డీజట్టుని, 11వ తరగతి చదువుతున్న దళిత విద్యార్థి జట్టు ఓడించినందుకు ప్రతీకారంగా అతని మూడు వేళ్లనీ ఓడిపోయిన జట్టు సభ్యులు కోసేశారు. అదీ అతను పరీక్ష రాయడానికి వెళుతున్న సమయంలో జరిగింది.

ఒక కబడ్డీపోటీ కులఉద్రిక్తతలకు దారితీసింది. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పైకులానికి చెందిన కబడ్డీ జట్టుని దళిత విద్యార్థి పాల్గొన్న జట్టు ఓడించటంతో ఈ దాడి జరిగిందని బాధిత కుటుంబసభ్యులు చెబుతుండగా, పైకులానికి చెందిన కబడ్డీజట్టు సభ్యుడి సోదరితో బాధిత విద్యార్థికి ఉన్న ప్రేమవ్యవహారం కారణమని పోలీసులు అంటున్నారు.

బాధిత విద్యార్థి అరియనాయగీపురానికి చెందిన ఒక ఇటుకబట్టీ కార్మికుడి కుమారుడు. పేరు దేవేంద్రన్‌. అతను తిరునెల్వేలి జిల్లాలోని పాలయంకోట్టైలోని తన పాఠశాలకు వెళుతుండగా నిందితులు అతనిపై దాడి చేశారు. ప్రస్తుతం తిరునల్వేలి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం దేవేంద్రన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ముగ్గురు మైనర్లు బస్సును ఆపారు. ఆ తర్వాత దేవేంద్రన్ ని బయటకు లాగి అతనిపై దాడిచేసి అతని ఎడమచేతి మూడువేళ్లు కోసేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆ యువకుడి తండ్రిపై కూడా నిందుతులు దాడిచేశారు. ఈ దాడిలో దేవేంద్రన్ తండ్రి తలమీద గాయాలయ్యాయి. సమీపంలో నిలబడి ఉన్న వ్యక్తులు బాధితులకు సహాయం చేయడానికి వచ్చేసరికి దాడిచేసిన వారు పారిపోయారు. ఈ సంఘటనతో తీవ్ర ఆగ్రహం పెల్లుబీకింది. విద్యార్థి కుటుంబీకులు, దళిత సంఘాల కార్యకర్తలు న్యాయం కోసం డిమాండ్‌ చేస్తున్నారు.

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటే బాధితుడే కాదు, నిందితులు కూడా మైనర్లే. మైనర్లలో కూడా కులతత్వం, దళితుల పట్ల వివక్ష, ఏహ్యభావం, వారినేం చేసినా పర్లేదనే చులకన భావాలు ఎంత పెరిగిపోతున్నాయో ఈ దారుణ సంఘటన తెలియచేస్తున్నది. కేవలం కులతత్వమే కాదు, హింసా ప్రవృత్తి, నేర స్వభావం కూడా నూనుగు మీసాల నవతరాన్ని కూడా వదలడం లేదంటే మన సమాజం ఎంత అథఃపాతాళానికి వెళుతున్నదో తెలుస్తుంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు