Friday, 7 August 2026

హైదరాబాద్‌లో దారుణం.. హ్యాపీ హోలీ అంటూ యాసిడ్‌తో దాడి..

హోలీ పండగ రోజున హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సైదాబాద్ భూలక్ష్మీమాతా ఆలయం అకౌంటెంట్‌పై యాసిడ్ దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి ఆలయం లోపలికివచ్చి ‘హ్యాపీ హోలీ’ అంటూ అకౌంటెంట్‌ తలపై యాసిడ్ పోశాడు. ఈ ఘటనలో అకౌంటెంట్ నర్సింగ్ రావుకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే నర్సింగ్ రావును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సాయంత్రం సమయంలో ఆలయం లోపలికివచ్చిన గుర్తుతెలియని వ్యక్తి హ్యాపీ హోలీ అంటూ అకౌంటెంట్ నర్సింగ్ రావుపై యాసిడ్ పోశాడు. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనతో ఆలయ పరిసరప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. తీవ్ర గాయాలతో అకౌంటెంట్ విలవిలలాడిపోయారు.

సైదాబాద్‌ ఆలయంలో యాసిడ్‌దాడి ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. నిందితుడి కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు. నిందితుడు క్యాప్, మాస్క్ ధరించిఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చూస్తే.. ఇది ముందుగా ప్లాన్ చేసిన దాడిగా అనిపిస్తోందని పోలీసులు పేర్కొంటున్నారు. యాసిడ్‌ ఘటనను ఆలయ ఛైర్మన్‌ శ్రీధర్‌ ఖండించారు. అన్నదానానికి సంబంధించిన వివరాలు అడుగుతూ అకౌంటెంట్‌ నర్సింగ్‌రావుపై సడెన్‌గా దాడిచేసినట్లు తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు