Friday, 7 August 2026

భారతీయ విద్యార్ధి వీసా రద్దు..?

పాలస్తీనా ఉగ్రవాదసంస్థ హమాస్‌కు మద్దతు ఇచ్చినందుకు వీసా రద్దుకావడంతో, ఓ భారతీయ విద్యార్థిని తనంతట తానుగా ఆమెరికాను వీడారు (స్వీయ బహిష్కరణ). కొలంబియాలో యూనివర్సిటీలో చదువుకుంటున్న రంజనీ శ్రీనివాసన్, సీబీపీ హోమ్ యాప్ సాయంతో మార్చి 11న దేశాన్ని వీడారు. భద్రతాకారణాల రీత్యా అమెరికా విదేశాంగశాఖ ఆమె వీసాను మార్చి 5న రద్దు చేసింది. ఈ విషయాన్ని హోమ్‌లాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ క్రిస్టీ నోయెమ్ ధ్రువీకరించారు. రంజనీ ఎయిర్‌పోర్టులో ఉన్నప్పుడు తీసిన వీడియోను నెట్టింట పంచుకున్నారు.

అమెరికాలో చదువుకోవటానికి వీసా మంజూరు చేయటం అనేది హక్కు, గౌరవంతో కూడిన అంశం. చదువుకోవటానికి వచ్చి.. హింస, ఉగ్రవాదాన్ని సమర్థించినప్పుడు వీసా హక్కును రద్దుచేయటం అనేది సరైన నిర్ణయం. అలాంటివారు దేశంలో ఉండకూడదు. కొలంబియా యూనివర్సిటీలో ఉగ్రవాద సానుభూతిపరులలో ఒకరు తనకుతాను స్వీయ బహిష్కరణకు CBP హోం యాప్ ను ఉపయోగించటం చూసి నేను సంతోషంగా ఉన్నాను, అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ వింగ్ కార్యదర్శి క్రిస్టినోయెమ్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. మార్చి 5వ తేదీన రంజని శ్రీనివాసన్ వీసా రద్దు అయితే, మార్చి 11న ఆమె అమెరికా నుంచి బయలుదేరి ఇండియాకు వచ్చేసింది. ఈ విషయాన్ని అమెరికా ప్రకటించింది.

అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో అర్కిటెక్చర్, అర్బన్ ప్లానింగ్ కోర్సులో డిగ్రీ చదువుతున్న భారతీయ స్టూడెంట్, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ డిజైన్ లో మాస్టర్స్ చేశారు. శ్రీనివాసన్ ఇండియాలోని CEPT (సెంటర్ ఫారన్ ఎక్సలెన్స్ ఇన్ అర్బన్ ప్లానింగ్ అండ్ డిజైన్) లో డిగ్రీ చేశారు. ఇది గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఉంది. ఇంతకీ రంజనీ శ్రీనివాసన్ అమెరికా నుంచి బయలుదేరి ఇండియాలో ఎక్కడ దిగింది? ఆమెది ఏ రాష్ట్రం? ఆమె కుటుంబసభ్యుల వివరాలు ఏంటీ? అనే విషయాలను మాత్రం అమెరికా వెల్లడించలేదు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు