Friday, 7 August 2026

నక్సల్స్ తో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించింది నక్సలైట్ కాదు గిరిజనుడు

మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలో జరిగిన నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో మరణించిన వ్యక్తి గిరిజనుడని, మావోయిస్టు కాదని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ప్రతిపక్ష కాంగ్రెస్ అతన్ని నిర్దోషిగా అభివర్ణించి, ఈ సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుతోపాటు న్యాయవిచారణ కూడా జరపాలని డిమాండ్ చేసింది. మృతుడిని బైగా కమ్యూనిటీకి చెందిన హిరాన్ సింగ్ పార్థ (38) గా అధికారులు గుర్తించారు. ఆయనను ముఖ్యంగా vulernable గిరిజన సమూహంగా వర్గీకరించారు.

మార్చి 9న ఎన్‌కౌంటర్ జరిగిందని, మార్చి 13న పార్థ గుర్తింపు నిర్ధారించబడిందని శనివారం ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఖతియాలోని అటవీ ప్రాంతంలో పార్థ నక్సలైట్లతో కలిసి ఉన్నట్లు బాలాఘాట్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) సంజయ్ కుమార్ తెలిపారు. అతను మావోయిస్టులతో ఎలా ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు అనే విషయం ఇన్వెస్టిగేషన్ తరువాత నిర్ధారించగలం అని కుమార్ మీడియాతో అన్నారు. “అతను మావోయిస్టు అని మా వద్ద ఎలాంటి రికార్డులు లేవు. ప్రస్తుతానికి అతను లసారా తోలా గ్రామ నివాసి” అని ఉన్నతాధికారి తెలిపారు. ఎన్‌కౌంటర్ తర్వాత, మావోయిస్టులతో సంబంధాలు ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

గిరిజనులు ఎక్కువగా నివసించే మండల జిల్లాలోని బిచ్చియా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణ్ సింగ్ పట్టా, శనివారం పార్థ గ్రామాన్ని సందర్శించి తన పిల్లలను మరియు ఇతర నివాసితులను కలిశానని చెప్పారు. నేను ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అక్కడే ఉన్నాను, కానీ పోలీసులు నన్ను అతని భార్యను కలవడానికి అనుమతించలేదు. ఆమె పోలీస్ స్టేషన్లో ఉందని నాకు చెప్పబడింది అని గిరిజన నాయకుడు పట్టా అన్నారు.

ఐదుగురు పిల్లల తండ్రి అయిన పార్థ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం కింద పనిచేసిన అమాయకుడని కాంగ్రెస్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. “అతనికి మావోయిస్టులు ఎవరో కూడా తెలియకపోవచ్చు. అటవీ ఉత్పత్తులను సేకరించడానికి మరియు చిలుకలను పట్టుకోవడానికి అతను అడవిలోకి లోతుగా వెళ్లేవాడని నేను తెలుసుకున్నాను” అని పట్టా అన్నారు. న్యాయ విచారణ కోసం డిమాండ్ ను పునరుద్ఘాటించారు.

మార్చి 9న రాష్ట్ర పోలీసులు విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఎన్ కౌంటర్లో ఒక నక్సల్ కేడర్ మృతి చెందాడని, అతని గుర్తింపును ధృవీకరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘర్షణలో దాదాపు 205 రౌండ్లు కాల్పులు జరిగాయని, నక్సలైట్లు 125 రౌండ్లు కాల్పులు జరిపారని ఐజీ కుమార్ తెలిపారు. పార్థా మృతదేహం దగ్గర 315 బోర్ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఖతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్హా నేషనల్ పార్క్ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నట్లు సూచిస్తూ మార్చి 8న అందిన నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా రాష్ట్ర పోలీసులు యాంటీ నక్సల్ హాక్ ఫోర్స్ ఆపరేషన్ ప్రారంభించారని కుమార్ చెప్పారు.

పార్థ హత్యతో పాటు, నక్సలైట్లకు రేషన్ సరఫరా చేశారని ఆరోపిస్తూ, 28 ఏళ్ల అటవీ శాఖ ఉద్యోగులు అశోక్ కుమార్ వాల్కో మరియు సంతోష్ కుమార్ దూర్వే అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిపై కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద కేసు నమోదు చేశారు. అయితే అటవీ కార్మికులసంఘం అయిన మధ్యప్రదేశ్ వాన్ కర్మచారి సంఘ్ యొక్క మండల యూనిట్ చీఫ్ బాల్సింగ్ ఠాకూర్, ఇద్దరినీ తప్పుడు ఆరోపణలతో ఇరికించారని పేర్కొన్నారు. “మేము మండలా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కలిసి వారి విడుదల కోసం పిటిషన్ సమర్పిస్తాము” అని ఆయన చెప్పారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు