Saturday, 8 August 2026

జర్నలిస్ట్ అంటే ఎవరు..?

ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ (Freedom of Press) గురించి జర్నలిస్ట్ ల గురించి రాజ్యాంగంలో ఎక్కడాలేదు. Article 19(1)(a) ప్రకారం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద పత్రికా స్వేచ్ఛ వస్తుంది. మాములు సిటిజెన్ కు ఎలాంటి విధులు హక్కులు బాధ్యతలు ఉంటాయో అలాగే జర్నలిస్టులకు ఉంటాయి. జర్నలిజం అన్ని వృత్తుల్లాగే ఒక వృత్తి మాత్రమే.

ఆర్టికల్ 19(1)(a) పౌరులకు వారి ఆలోచనలు, అభిప్రాయాలు మరియు ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే హక్కును అందిస్తుంది. ఇందులో ప్రసంగం, రచన, ముద్రణ, దృశ్య ప్రాతినిధ్యాలు లేదా మరే ఇతర మార్గాల ద్వారా తనను తాను వ్యక్తీకరించుకునే స్వేచ్ఛ కూడా ఉంటుంది.

అయితే భారతదేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రత, రాష్ట్ర భద్రత, కోర్టు ధిక్కారం, పరువునష్టం, నేరానికి ప్రేరేపించడం లేదా పార్లమెంటు సార్వభౌమాధికారం మరియు సమగ్రత ప్రయోజనాల కోసం ఈ హక్కుపై సహేతుకమైన ఆంక్షలు విధించవచ్చు.

భావప్రకటనా స్వేచ్చ అనేది అందరికి సమానమే. జర్నలిస్టులకు ప్రత్యేకంగా లేదు. ఏ పౌరుడు అయినాసరే వార్తలు సేకరించవచ్చు, విశ్లేషించవచ్చు, చెప్పవచ్చు, రాయవచ్చు దీనికి ప్రత్యేకమైన గుర్తింపు అవసరంలేదు. ఇస్టమొచ్చినట్లు ఇతరులను కించపరచడం, అబ్యూస్ చేయడం అనేది ఎవరు చేసినా శిక్ష ఒకటే. జర్నలిస్ట్ కాకుండా ఇతరులు చేస్తే వాళ్ళు క్రిమినల్స్ జర్నలిస్టులు గా గుర్తించబడిన వాళ్ళు చేస్తే వాళ్ళు నాన్ క్రిమినల్స్ గా చట్టంలో ఎక్కడ లేదు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో అందరు జర్నలిస్టులే. ఎవరు నిష్పకాక్షికంగా నిస్వార్థంగా నిజాయితీగా విషయం చెబితే దాన్ని ప్రజలు నమ్ముతారు. దీని కొరకు జర్నలిస్ట్ కావలసిన అవసరం లేదు. కాలంతోపాటు టెక్నలాజీbg కొత్తపుంతలు తొక్కుతోంది, దానికి అనుగుణంగానే మార్పులు వస్తుంటాయి వాటి గురించి అవగాహన పెంచుకోకపోతే నవ్వులపాలు అవుతారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు