Friday, 7 August 2026

మార్చ్ 24 నుండి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అమలుచేస్తాం: TTD

తెలంగాణ ప్రజాప్రతినిధులకు TTD శుభవార్త చెప్పింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈనెల 24 నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఆదేశాలమేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం, మంగళవారాల్లో ప్రజాప్రతినిధుల సిఫార్స్ లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనుంది టీటీడీ. అలాగే బుధ, గురువారాల్లో ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలపై రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఒక్క ప్రజాప్రతినిధి లేఖపై 6 మంది భక్తులకు దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రజాప్రతినిధుల సిఫారస్సు లేఖలపై ఇప్పటికే మంజూరు చేస్తున్న నాలుగు రోజులతో పాటు మరో రోజు అదనంగా బ్రేక్ దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది. ఇకపై ఆదివారం కూడా బ్రేక్ దర్శనం మంజూరు చేయాలని టీటీడీ నిర్ణయించింది.

కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతిమేరకు ఫిబ్రవరిలోనే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనంతో పాటు ప్రత్యేక ప్రవేశదర్శనం కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయినప్పటికీ గత రెండునెలలుగా టీటీడీ అధికారులు పరిపాలనాపరమైన ఇబ్బందుల నేపథ్యంలో బ్రేక్ దర్శనం మంజూరు చేసేందుకు అంగీకరించలేదు. అయితే రెండురోజుల క్రితం అమరావతిలో జరిగిన శ్రీవారికళ్యాణం నేపథ్యంలో ఇదే విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అక్కడే అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి త్వరితగతిన తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనంతో పాటు, ప్రత్యేక ప్రవేశదర్శనాన్ని కల్పించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాబోయే సోమవారం (ఈనెల 24) నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాన్ని మంజూరు చేసేందుకు టీటీడీ ఆమోదం తెలిపింది. దీంతో ఈనెల 24 నుంచి సోమ, మంగళవారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం, బుధ, గురువారాల్లో ప్రత్యేక దర్శనాలను కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు