Friday, 7 August 2026

తెలుగు రాష్ట్రాల్లో Betting Apps ప్రమోట్ చేస్తున్నవారిపై కేసులు

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్‌లను (Betting Apps) ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. బెట్టింగ్ యాప్ ల వలలోచిక్కి యువత బలవన్మరణాలకు పాల్పడుతుండటంతో వారిపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం తెలంగాణ ఆర్టీసీ ఎండీ సూచనలతో విశాఖపట్నానికి చెందిన యూట్యూబర్లలో కల్బాయ్ నానిపై మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కు చెందిన బయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదైంది.

ఇటీవల పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో 11 మంది ప్రముఖులపై కేసులు నమోదు చేశారు. యూట్యూబ్ వీడియోలను ప్రమోట్ చేసే ముసుగులో బెట్టింగ్ యాప్లకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి, వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బెట్టింగుల ద్వారా తాము విపరీతంగా ఆర్జించినట్టు వల వేస్తున్నారు. ప్రమోషనల్ కోడ్స్ రూపంలో యువతకు వలవేసి వారి బెట్టింగులు ఆడే డబ్బుల్లో ప్రమోట్ చేసినందుకు రిఫరల్ డబ్బులు పొందుతున్నారు. నాలుగైదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఆర్థికనేరాలు చాపకింద నీరులా సాగుతున్నాయి.

ఈ క్రమంలో బెట్టింగులు ఆడటం, డబ్బు పోగొట్టుకున్నతర్వాత పోయినచోట వెదుక్కోవాలనే ధోరణితో అప్పుల పాలవడం, చివరకు వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరిగాయి. కొన్నేళ్లుగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బుల్లి తెర నటులు, సినీ ప్రపంచంలో అవకాశాలను వెదక్కుంటున్న యువతులు ఈ ఆర్థిక నేరాల్లో పాల్గొంటున్నారు.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న 11 మందిపై తాజాగా సిటీ పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన వారిలో అజయ్, కిరణ్ గౌడ్, బయ్యాసన్నీ యాదవ్, విష్ణుప్రియ, సుప్రీత, హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్, రీతూ చౌదరి, టేస్టీ తేజ, సుదీర్ రాజు తదితరులు ఉన్నారు. వీరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాటి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోన్న పలువురు సోషల్మీడియా, టీవీ నటులపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, బండారు శేషాయని సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్, సందీప్ తదితరులపై కేసు నమోదుచేశారు. వారిపై 318 (4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు