Friday, 7 August 2026

పదేళ్లలో రైట్ ఆఫ్ అయిన బ్యాంకు లోన్స్ 16.35 లక్షల కోట్లు

గత పదేళ్లకాలంలో దేశీయబ్యాంకులు రూ. 16.35 లక్షల కోట్ల విలువైన మొండిబకాయిలను మాఫీ చేసినట్టు కేంద్రం తెలిపింది. ఈమేరకు సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు తెలియజేశారు. అత్యధికంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.2,36,265 కోట్లను రద్దు చేయగా, అత్యల్పంగా 2014-15లో రూ.58,786 కోట్ల మొండి బకాయిలను రైటాఫ్ చేసినట్టు ఆర్థికమంత్రి తెలిపారు. 2022-23లో మొత్తం రూ.2,16,324 కోట్లు, 2023-24లో రూ.1,70,270 కోట్లను బ్యాంకులు రద్దుచేశాయి.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మార్గదర్శకాలు, బ్యాంకు బోర్డులు ఆమోదించిన విధానాలప్రకారం నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత బ్యాంకులు నిరర్థక ఆస్తులను (ఎన్పీఏ) రద్దుచేస్తాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే ఈ రైటాఫ్ ప్రక్రియ కారణంగా రుణగ్రహీతలకు ప్రయోజనం కల్పించినట్టుకాదని, బ్యాంకులు వివిధ రికవరీమెకానిజం ద్వారా రుణాలను తిరిగి వసూలుచేసే ప్రక్రియను కొనసాగిస్తాయని స్పష్టం చేశారు.

సివిల్ కోర్టులలో లేదా డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ లో దావా దాఖలు చేయడం, ఫైనాన్షియల్ అసెట్స్ సెక్యూరిటీ అండ్ రీకన్స్ట్రక్షన్ కింద చర్యలు తీసుకోవడం, సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ అమలు చేయడం, నేషనల్ బ్యాంక్, కంపెనీ లా ట్రిబ్యూనల్లో కేసులు దాఖలు చేయడం వంటి పద్ధతులను చేపడతాయని పేర్కొన్నారు.

RBI గణాంకాల ప్రకారం 2024 డిసెంబర్ ఆఖరు నాటికి, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు 29 కంపెనీలను NDAలుగా గుర్తించాయి. ఇందులోని ఒక్కో కంపెనీకి రూ.వెయ్యికోట్ల చొప్పున బకాయిలు ఉన్నాయని ఆర్థికమంత్రి వివరించారు. వీటి విలువ రూ.61,027 కోట్లు ఉంటాయని పేర్కొన్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు