Friday, 7 August 2026

సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన సునీత విలియమ్స్

యావత్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురుచూసిన వ్యోమగాములరాకకు శుభంకార్డు పడింది. 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు Sunitha Williams, Butch Wilmore సురక్షితంగా భూమి మీద దిగారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.27 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న డ్రాగన్ క్రూ కాప్సూల్ ఫోరిడా తీరానికి సమీపంలోని సముద్రజలాల్లో పారాషూట్‌ల సాయంతో సురక్షితంగా దిగింది. సునీతా, బుచ్‌లతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా వచ్చారు.

తొలుత సునీతా, బుచ్‌ను NASA సిబ్బంది జాగ్రత్తగా క్యాప్సూల్‌ నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని వైద్య పరీక్షలకోసం స్ట్రెచ్చర్లపై తరలించారు. ISS లోని సూక్ష్మస్థాయి గురుత్వాకర్షణ శక్తిలో ఎక్కువ సమయం గడిపినందుకు ఇద్దరు వ్యోమగాములు బలహీనంగా మారారని నిపుణులు చెబుతున్నారు. కండరాలు క్షీణించడం, సరిగా నిలబడలేక బ్యాలెన్స్ కోల్పోవడం వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఉదయం 10.15 గంటలకు క్రూడ్రాగన్, ISS విడిపోవడం (అన్లాకింగ్) మొదలైంది. 10.35 గంటలకు పూర్తిగా విడిపోయింది. భూమి దిశగా 17 గంటల ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇందుకోసం పలుమార్లు రాకెట్ ప్రజ్వలన విన్యాసాలు చేపట్టింది.

ఆ వెంటనే భూమిపై ల్యాండింగ్ ప్రదేశం దిశకోసం క్రూ డ్రాగన్ ముందుభాగంలోని నాలుగు డ్రాకో ఇంజిన్ల ప్రజ్వలన మొదలైంది. ఏడున్నర నిమిషాలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. తర్వాత భూ వాతావరణంలోకి ప్రవేశం (రీఎంట్రీ) కోసం కోన్ భాగాన్ని వ్యోమనౌక మూసివేసింది. రీఎంట్రీ సమయంలో తలెత్తే తీవ్రస్థాయి వేడి నుంచి వ్యోమగాములను సురక్షితంగా ఉంచే వ్యవస్థ ఆన్ అయింది.

రీఎంట్రీ సమయంలో భూవాతావరణంలోకి వ్యోమనౌక చాలా వేగంగా ప్రవేశించింది. ఆ రాపిడి కారణంగా ఏకంగా 1650 డిగ్రీల సెంటిగ్రేడ్ల వేడి ఉత్పన్నమై, వ్యోమనౌకచుట్టూ ప్లాస్మా పేరుకుపోయింది. దాంతో కొంతసేపు వ్యోమనౌకతో కమ్యూనికేషన్ తెగిపోయి (రేడియో సైలెన్స్) ఉత్కంఠ ఏర్పడింది. వ్యోమనౌక చుట్టూ ఉష్ణకవచం సమర్థంగా పనిచేసి, ఆ వేడిని తట్టుకుంది. రీఎంట్రీ తర్వాత రేడియో సైలెన్స్ను ఛేదిస్తూ కమాండర్ నిక్ హేగ్ మాట్లాడటంతో కమాండ్ సెంటర్లో అందరిలో ఆనందం వెల్లివిరిసింది.

సాగరజలాలకు 18 వేల అడుగుల ఎత్తులో ఉండగా వ్యోమనౌకలోని రెండు డ్రోగ్చట్లు విచ్చుకున్నాయి. ఆ సమయంలో వ్యోమనౌక వేగం గంటకు 560 కిలోమీటర్లు. డ్రోగ్చట్లు సమర్థంగా పనిచేయడంతో క్రూడ్రాగన్ వేగం గణనీయంగా తగ్గిపోయింది. వ్యోమనౌక వేగం గంటకు 190 కిలోమీటర్లకు చేరుకోగానే, సాగరజలాల నుంచి 6,500 అడుగుల ఎత్తులో రెండు ప్రధాన పారాచూట్లు విచ్చుకున్నాయి. డ్రోగ్చట్లు, పారాచూట్లు క్రూ డ్రాగన్ వేగానికి సమర్థంగా కళ్లెం వేయడంతో కమాండ్ సెంటర్లో చప్పట్లు మార్మోగాయి. ఆపై ఫ్లోరిడాలోని తలహాసీ తీరంలో సముద్రజలాల్లో వ్యోమనౌక నెమ్మదిగా దిగింది. నిమిషాల వ్యవధిలోనే స్పీడ్ బోట్లలో అక్కడికి రికవరీ సిబ్బంది దూసుకొచ్చారు. పరిస్థితులన్నీ సాధారణస్థితిలోనే ఉన్నాయని నిర్ధారించుకున్నాక వ్యోమనౌకను మేగన్ నౌకపైకి చేర్చారు.

ఆపై లోపల ఉన్న నలుగురు వ్యోమగాములను స్పేస్ఎక్స్ సిబ్బంది జాగ్రత్తగా ఒక్కొక్కరినీ బయటకు తీసుకొచ్చారు. తొలుత కమాండర్ నిక్ హేగ్, ఆ తర్వాత వరుసగా అలెగ్జాండర్, సునీతా విలియమ్స్, విల్మోర్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చారు. క్రూడ్రాగన్ నుంచి బయటకు రాగానే సునీత ఆనందంతో చేతులు ఊపుతూ అభివాదం చేశారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు