Saturday, 8 August 2026

ఏప్రిల్ 1 నుంచి ఈ ఫోన్ నెంబర్లకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పనిచేయదు

టెలికాం ఆపరేటర్లు మాత్రమే కాదు.. గూగుల్ పే, ఫోన్ పేతో పాటు బ్యాంకులు అన్ని కలిసి సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం కూడా 2025 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమలు కాబోతున్నది. అంటే మరో 10 రోజుల్లోనే. మీ ఫోన్ నెంబర్ యాక్టివ్ గా లేనట్లయితే, అలాంటి నెంబర్ కు ఇకనుంచి మీరు గూగుల్ పే, ఫోన్ పే లాంటి UPI ద్వారా డబ్బులు పంపించలేరు.

యాక్టివ్ గా లేని ఫోన్ నెంబర్ కు ఎలాంటి డబ్బులు పంపించలేరు. అలాంటి ఫోన్ నెంబర్లకు బ్యాంకు ఖాతా నుంచే కాకుండా UPI పేమెంట్ గేట్ వే నుంచి తొలగించనున్నారు. అది కూడా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమలు కాబోతున్నది. పూర్తి వివరాలు ఏంటంటే..
ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఐ (UPI) కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న యూపీఐ అకౌంట్ కు ఓ ఫోన్ నెంబర్ లింక్ చేసి ఉంటారు. ఆ ఫోన్ నెంబర్ ను మీరు చాలా కాలంగా ఉపయోగించకుండా ఇన్ యాక్టివ్ గా ఉన్నట్లయితే ఇకనుంచి ఆ ఫోన్ నెంబర్ పై ఉన్నటువంటి యూపీఐ యాప్ కూడా పని చేయదు.

ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. రోజురోజుకు సైబర్ క్రైంలు పెరుగుతున్నందున NPCI ఈ నిర్ణయం తీసుకుంది. ఇనాక్టివ్ నంబర్లతో యూపీఐ, బ్యాంకింగ్ వ్యవస్థల్లో టెక్నికల్ సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. టెలికాం ప్రొవైడర్లు ఈ నంబర్లను వేరొకరికి రీలోకేట్ చేసినప్పుడు ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది. అటువంటి ప్రమాదాలను నివారించేందుకు NPCI ఈ నిర్ణయం తీసుకుంది. యూపీఐ లావాదేవీలు సవ్యంగా సాగాలంటే తప్పనిసరిగా యాక్టివ్ గా ఉన్న మొబైల్ నంబర్లను మాత్రమే లింక్ చేయాలని సూచించింది.

మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్ యాక్టివ్ గా ఉందా లేదా తెలుసుకోవాలంటే మీ టెలికాం ప్రొవైడర్ (జియో, ఎయిర్టెల్, విఐ, లేదా బిఎస్ఎన్ఎల్ వంటివి)తో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ యాక్టివ్ గా లేకపోతే వెంటనే తిరిగి యాక్టివేట్ చేయాలి. లేదా కొత్త మొబైల్ నంబర్ తో మీ బ్యాంక్ ఖాతాను అప్డేట్ చేయాలి.

ప్రతివారం యాక్టివ్ గా లేని మొబైల్ నంబర్ల రికార్డులను సవరించాలని NPCI బ్యాంకులు, UPI అప్లికేషన్లను ఆదేశించింది. తద్వారా ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులనుంచి ఏవైనా యాక్టివ్ గా లేని నంబర్లను తొలగించనున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు