Friday, 7 August 2026

రోజుకు రూ.5 వేలు ఇస్తేనే కాపురం.. భార్య బాధితుడి ఆవేదన..

బెంగుళూరు నగర పరిధిలోని వయ్యాలికావల్ పోలీస్ స్టేషన్‌లో శ్రీకాంత్‌ అనే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ తన భార్యపై బుధవారం ఫిర్యాదు చేశాడు. తమకు ఆగస్టు 2022లో వివాహం జరిగిందని, వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తోన్న తనను భార్య నిత్యం వేధిస్తోందని ఆరోపించాడు. జూమ్‌లో ఆఫీసు మీటింగులకు హజరయ్యే సమయంలో మధ్యలోకి వచ్చి డ్యాన్స్‌లు చేస్తూ, అకారణంగా దూషించడం వంటివి చేస్తోందని తెలిపాడు. ఆమె కారణంగా ఉద్యోగం పోయిందని, కాపురం చేయాలంటే షరతులు పెడుతోందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆమె అడిగినంత డబ్బులు ఇవ్వకున్నా, చెప్పింది చేయకున్నా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగుతోందని చెప్పాడు. భౌతిక దాడులకు దిగడమే కాదు, ప్రయివేట్ భాగాలపై దాడిచేసి చంపడానికి ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశాడు.

అంతేకాదు తనతో కాపురం చేయాలంటే రోజుకు రూ.5000 ఇవ్వాలంటోందని వాపోయాడు. అలాగే, విడాకులు అడిగితే రూ.45 లక్షలు కావాలని డిమాండ్ చేస్తోందని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తూ, నరకం చూపిస్తోందని పోలీసులకు మొరపెట్టుకున్నాడు. పిల్లలను కనేందుకు తిరస్కరిస్తోందని, 60 ఏళ్ల వయస్సులో దత్తత తీసుకుందామని చెబుతోందని పేర్కొన్నారు.

అయితే శ్రీకాంత్‌ ఆరోపణలను ఆయన భార్య బిందు ఖండించారు. విడాకుల కోసం డబ్బులు డిమాండ్‌ చేయలేదన్నారు. తమ వివాహానికి తన తండ్రి రూ.40 లక్షలు ఖర్చు చేశారని, ఆ మొత్తాన్ని తిరిగివ్వాలని మాత్రమే కోరానని చెప్పారు. శ్రీకాంతే తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని, వరకట్నం వేధింపులకు గురిచేశాడని ప్రత్యారోపణలు చేశారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు