Friday, 7 August 2026

న్యాయమూర్తి ఇంట్లో ప్రమాదవశాత్తు దొరికిన అన్యాయపు సొమ్ము!

ఢిల్లీ హైకోర్ట్ న్యాయమూర్తి Justice Yashwant Varma ఇంట్లో నోట్ల కట్టలు బైటపడ్డాయి. అయితే ఈ నోట్ల కట్టలు ఏదో ACB, ED, DRI దాడుల్లో దొరకలేదు. “ప్రమాదవశాత్తు” బైటపడ్డాయి. ఈ నెల 14న జస్టీస్ వర్మ గారింట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆయన ఇంట్లోలేరు. అగ్నిమాపక శాఖకి ఫిర్యాదు చేసినంతనే వారొచ్చి మంటలు ఆర్పారు. ఆ సందర్భంలో ఒక గదిలో కోట్లాది రూపాయల నోట్ల కట్టలు బైటపడ్డాయి. అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ నోట్ల కట్టల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్మంతా లెక్కల్లో చూపని నగదుగా నిర్ధారించారు. దీంతో సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టీస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో కొలీజియం స్పందించి జస్టీస్ యశ్వంత్ వర్మని అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసింది.

గతంలో జస్టీస్ వర్మ అలహాబాద్ లోనే పనిచేసి 2021లో ఢిల్లీకి వచ్చారు. “కేవలం బదిలీతోనే న్యాయ శాఖ ఇమేజ్ తిరిగిరాదు” అని ఐదుగురు సభ్యుల కొలీజియం అభిప్రాయం వ్యక్తం చేసింది. వర్మని రాజీనామా చేయమని అడగటమో లేదా ఒక కమిటీని నియమించి అంతర్గత విచారణ చేయడమో చేయాలని కొలీజియం భావించింది. ఈ మొత్తం ఉదంతం న్యాయవర్గాల్లో సంచలనం రేకెత్తించింది.

న్యాయాన్ని కాపాడాల్సిన, అవినీతిని నిర్మూలించాల్సిన పవిత్రమైన బాధ్యతలో వుండి జస్టీస్ వర్మ ఇంట్లోనే లెక్కలు చెప్పని కోట్లాది రూపాయల నోట్ల కట్టలు దొరకడం కంచే చేను మేసిన చందంగా వుందని ప్రజలు అనుకుంటున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు