Friday, 7 August 2026

తెలంగాణాలో వర్షం.. వడగళ్ల వాన..

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిన్న తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల కురిసిన వడగళ్ల వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా ముథోల్‌లో అత్యధికంగా 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వడగళ్ల వాన కారణంగా వరి, మామిడి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. కాగజ్‌నగర్ పట్టణంలోని నాగౌంబస్తీలో ఇంటిగోడ కూలి చందెంకర్ దౌలత్ (79) అనే వృద్ధుడు మృతి చెందాడు.

నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి వడగళ్ల వాన కురిసింది. జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, మియాపూర్‌, మదీనాగూడ, ప్రగతినగర్‌, బాచుపల్లి, బోరబండ, మధురానగర్‌, బోయిన్‌పల్లి, ప్యారడైజ్‌, గండిమైసమ్మ, ముషీరాబాద్‌ తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది.

నేటి నుంచి సోమవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు