Friday, 7 August 2026

ఒకే నెలలో దేశంలోని కోటి మంది వాట్సాప్ ఖాతాలు తొలగింపు

భారతదేశంలో సోషల్ మీడియా వినియోగం విషయంలో నిబంధనలను ఆయా సంస్థలు మరింత కఠినతరం చేస్తున్నాయి. ఇప్పటికే యూట్యూబ్ కోట్ల కొద్ది అకౌంట్లను తొలగించగా, తాజాగా అదే బాటలోకి మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) కూడా చేరింది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ 2025 జనవరి 1 నుంచి 30 వరకు ఒక్క నెలలోనే దాదాపు 99 లక్షల (10 మిలియన్లు) భారతీయ ఖాతాలను నిషేధించింది. ఇది కంపెనీకి సరికొత్త రికార్డని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకే నెలలో ఈ స్థాయిలో అకౌంట్లను తొలగించడం ఇదే మొదటిసారని నిపుణులు చెబుతున్నారు.

జనవరి 1 నుంచి 30, 2025 మధ్య కాలంలో వాట్సాప్ 99 లక్షల ఖాతాలను నిషేధించింది. ఈ ఖాతాలు వివిధ కారణాలతో నిషేధించబడ్డాయి. వాటిలో నకిలీ ఖాతాలు, స్పామ్ సందేశాలు పంపడం, అనుమానాస్పద కార్యకలాపాలు సహా అనేక వాట్సాప్ విధానాలను ఉల్లంఘించడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ నిషేధ చర్యలో భాగంగా దాదాపు 13.27 లక్షల ఖాతాలను ముందుగా, యూజర్ ఫిర్యాదులు అందకముందే, ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా బ్లాక్ చేశారు. దీన్ని బట్టి చూస్తే వాట్సాప్ భద్రతా వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుస్తుంది. ఈ క్రమంలో యూజర్లు వాట్సాప్ వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు సందేశాలు పంపిస్తే మీ అకౌంట్ కూడా బ్లాక్ అవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

వాట్సాప్ భద్రత కోసం ఇప్పటికే ఆటోమేటెడ్ సిస్టమ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇది ఒక వినియోగదారుల కార్యాచరణను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఉదాహరణకు ఒక ఖాతా నుంచి ఎక్కువమంది యూజర్లకు స్పామ్ సందేశాలు పంపితే లేదా నకిలీ సమాచారాన్ని పంపిస్తే, సిస్టమ్ వెంటనే ఆ ఖాతాను గుర్తించి, చివరకు నిషేధిస్తుంది. ఇటీవల కాలంలో ఆటోమేటెడ్ సిస్టమ్ అనుమానాస్పద అంశాలను త్వరితగతిన గుర్తించి చర్య తీసుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది వినియోగదారుల అనుభవాన్ని మరింత సురక్షితంగా, నమ్మకంగా ఉంచడంలో సహకరిస్తుంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు