Friday, 7 August 2026

అమెరికా చట్టాలకు కట్టుబడి ఉండండి.. విద్యార్థులకు భారత్‌ కీలక సూచన…

అమెరికాలోని భారతీయ విద్యార్థులకు (Indian Students in USA) కేంద్రం కీలక సూచనలు చేసింది. యూఎస్‌లోని భారతీయ విద్యార్థులు అక్కడ ప్రభుత్వ చట్టాలకు (American laws) కట్టుబడి ఉండాలని సూచించింది. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఎలాంటి అనుమానాలు వచ్చినా దేశం నుంచి బహిష్కరిస్తున్నారు. హమాస్‌తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఇటీవలే భారతీయ పరిశోధకుడు బాదర్‌ ఖాన్‌ సూరిపై అమెరికా బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. అంతకుముందు మరో విద్యార్థిని రంజిని శ్రీనివాసన్‌ను కూడా బహిష్కరించింది. ఈ నేపథ్యంలో భారత్‌ (India) అప్రమత్తమైంది.

ఈ మేరకు అమెరికాలోని భారతీయ విద్యార్థులకు (Indian Students) కేంద్రం కీలక సూచనలు చేసింది. యూఎస్‌లోని భారతీయ విద్యార్థులు అక్కడ ప్రభుత్వ చట్టాలకు (American laws) కట్టుబడి ఉండాలని సూచించింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అమెరికాలోని భారత ఎంబసీ, కాన్సులేట్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించింది. ఎంబసీ, కాన్సులేట్‌ కార్యాలయాలు విద్యార్థులు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. వీసాలు, వలస విధానాలపై నిర్ణయాలు పూర్తిగా ఆయా దేశాల విచక్షణాధికారానికి సంబంధించినవిగా పేర్కొంది. వాటిని పాటించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని స్పష్టం చేసింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు