Friday, 7 August 2026

శశిథరూర్ కాంగ్రెస్ ని వీడనున్నారా?

కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం MP Shashi Tharoor BJP లో చేరనున్నారా? ఈ ప్రశ్నకి అవుననే సమాధానమే వస్తుంది. అందుకు తగ్గట్టుగా ఖచ్చితమైన సంకేతాలు వస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కడంలేదని, పార్టీలో తాను పోషించాల్సిన పాత్ర గురించి స్పష్టత లేదని, దీంతో ఆయన అసంతృప్తిగా వున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య BJP నాయకుడు జై పాండాని ఆయన కలవడం, అలా కలిసిన ఫోటోని వైరల్ చేయడం కావాలనే జరిగిందని, ఆయన పార్టీని వీడనున్నారని అనడానికి ఇది స్పష్టమైన సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.

అద్భుతమైన వాగ్ధాటికి, అసాధారణ లోకజ్ఞానానికి, ఇంగ్లీషులో అసమాన్య పాండిత్యానికి పెట్టింది పేరైన శశిథరూర్ నాలుగుసార్లు తిరువనంతపురం లోక్ సభ స్థానం నుండి MP గా ఎన్నికయ్యారు. కొంతకాలం నుండి ఆయనకి కాంగ్రెస్ అధినాయకత్వంతో సరిపోవడం లేదని సంకేతాలు వస్తున్నాయి. గతంలో భారత్ తరపున యునైటెడ్ నేషన్స్ లో అధికార ప్రతినిధిగా వ్యవహరించిన ఆయన తన సామర్ధ్యాల్ని కాంగ్రెస్ పార్టీ సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నదని భావిస్తున్నారు. 2022లో జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన మల్లిఖార్జున ఖర్గే చేతిలో ఓడిపోయారు. తన సామర్ధ్యానికి తగిన గుర్తింపు లభించనందున ఆయన అసంతృప్తిగా వున్నారని విశ్లేషకుల అంచనా.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు