Friday, 7 August 2026

ఎట్టకేలకు పోసానికి బెయిల్ దొరికింది!

హమ్మయ్య! ఎట్టకేలకు పోసాని Posani Krishnamurali బెయిల్ లభించింది. సుమారు గత నెలరోజులుగా ఒక కేసు తరువాత మరో కేసుకింద బుక్కవడంతో పోసాని APలో జైళ్లయాత్ర చేస్తూ వచ్చారు. ఒక కేసులో రిమాండ్ పూర్తవగానే మరో కేసులో ఆయన కోసం డిమాండ్ వచ్చేది. వివిధ జిల్లాల పోలీసులు ఆయన కోసం క్యూ కట్టారు. అలా పోలీసులు మొత్తం ఆయన్ని రెండువేల కిలోమీటర్ల దూరం తిప్పారు. చివరకు CID నమోదు చేసిన కేసులో బెయిల్ దొరకడంతో ఆయన గుంటూరు జెయిల్ నుండి విడుదలయ్యారు.

YCP అధికారంలో వున్నప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసి మార్ఫ్ చేసిన ఫోటోల్ని ప్రదర్శించారనే అభియోగాల మీద పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు బుక్కయ్యాయి. ఈ క్రమంలో పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు గత ఫిబ్రవరి 26న హైదరాబాద్ లో ఆయన ఇంట్లోనే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇంక అక్కడి నుండి ఆయన్ని రాష్ట్రంలోని వివిధ జిల్లాల పోలీసులు రాష్ట్రమంతా తిప్పారు.

YCP అధికారంలో వుండగా పోసాని చాలా దూకుడుగా మీడియాలో అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగానూ, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగానూ వీడియోలు తయారు చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టేవారు. ఆయన స్వామిభక్తిని మెచ్చుకొని ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా అప్పటి ప్రభుత్వం నియమించింది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోసాని రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు, తాను ఇకమీదట ఎవరిమీద ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు, విమర్శలు చేయబోనని ప్రకటించారు. కానీ “చేసిన కర్మము చెడని పదార్ధము” అని వాగ్గేయకారుడు అన్నట్లు ఆయన వివిధ కేసుల్ని ఎదుర్కొన్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు