Friday, 7 August 2026

తెలంగాణలో (Telangana) జనాభాకంటే ఎక్కువ మొబైల్ ఫోన్లే…

మొబైల్స్ పై ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో (Telangana) జనాభాకంటే మొబైల్ ఫోన్లు అధికంగా ఉన్నాయంట. ఈమేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్-2024) సెప్టెంబర్ నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 4.19 కోట్లు, మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 4.4 కోట్లు, ల్యాండ్లైన్ వినియోగదారుల సంఖ్య 15.25 లక్షలుగా పేర్కొంది.

కేవలం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య గ్రామాల్లో 39%, పట్టణాల్లో 60%, మొబైల్ ఫోన్ల వినియోగదారుల సంఖ్య గ్రామాల్లో 41%, పట్టణాల్లో 59%, ల్యాండ్లైన్ వినియోగదారుల్లో గ్రామాల్లో 4%, పట్టణాల్లో 96%.

రాష్ట్ర Wireless Teledensity 105.32% ఉంది. అంటే సగటున ప్రతి 100 మందికి 105కి పైగా మొబైల్ ఫోన్లు ఉన్నట్లు వెల్లడైంది. ఈ అంశంలో దేశవ్యాప్తంగా తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో గోవా-152, కేరళ-115, హర్యానా 114 శాతంతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుత ఈ డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు కీలకంగా మారాయి. ఈ తరుణంలో సర్వే ప్రకారం తెలంగాణలో మొబైల్ వాడకం ఎక్కవగా ఉండటం, రాష్ట్ర ప్రజలు కమ్యూనికేషన్ టెక్నాలజీకి ఎంత ప్రయారిటీని ఇస్తున్నారో తెలుస్తోంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు