Friday, 7 August 2026

బీదర్ లో BRS అగ్రనేత ప్రింటింగ్ ప్రెస్ లో దొంగనోట్లు ముద్రించి పంచారు: బండి సంజయ్

బీదర్ లో BRS అగ్రనేతకు ఓ ప్రింటింగ్ ప్రెస్ ఉండేదని, ఆ ప్రెస్ లో BRS పాంప్లెట్స్ కాకుండా దొంగనోట్లు ముద్రించారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో సిద్దిపేట SP గా పనిచేసిన ఆఫీసర్ తనకు ఈ విషయం చెప్పారని ఆయన తెలిపారు. ఆ ప్రెస్ ను సీజ్ చేసేందుకు ఆయన వెళ్తుంటే.. రాష్ట్రంలోని ముఖ్యనాయకుడు ఫోన్ చేసి ఆపినట్టు ఆయన చెప్పారని వెల్లడించారు. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగనోట్లేనని, అప్పుడు ఆ నోట్లు ఎలా చెల్లాయోనని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పాస్ పోర్టు, దొంగనోట్ల దందా చేసిన కుటుంబం వేలకోట్లు సంపాదించిందని సంజయ్ మండిపడ్డారు. కరీంనగర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆదివారం తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లిక్కర్ దొంగలంతా ఒకేచోట సమావేశమై డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ‘దేశ GDPలో దక్షిణాది వాటా 36 శాతం ఉన్నందున పార్లమెంట్ లో కూడా దక్షిణాదికి 36 శాతం వాటా ఇవ్వాలని అడుగుతున్నరు.

కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రిగా ఏం చేయాలి? కేసు పెట్టాలి అరెస్ట్ చేయాలి. అది వదిలేసి ఇలా ఆరోపణలు చేయడం చూస్తుంటే దేశరాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం అవుతుంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు