Friday, 7 August 2026

Betting App Promotion లో బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై కేసు..?

సోషల్ మీడియా సెలెబ్రిటీలు, యూట్యూబర్లతో మొదలైన Betting App Promotion కేసుల పరంపర ఇప్పుడు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ లిస్ట్ లో టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి ప్రకాష్ రాజ్, హీరోయిన్ అనన్య నాగళ్ళ చేరగా, ఇప్పుడు టాలీవుడ్ బిగ్ స్టార్స్ నందమూరి బాలకృష్ణ, రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న అన్ స్టాపబుల్ షోలో ఓ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

రామారావు అనే వ్యక్తి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఫన్ 88 బెట్టింగ్ యాప్ కి బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్ లు ప్రమోషన్స్ చేశారని, ఈ ప్రమోషన్స్ వల్ల చాలామంది డబ్బులు నష్టపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు రామారావు. అన్ స్టాపబుల్ షోకి ప్రభాస్, గోపీచంద్ లు గెస్టుగా అటెండ్ అయ్యారు. ఈ ఎపిసోడ్ లో ఫన్ 88 అనే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారు. ఈ ఎపిసోడ్ చూసి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నానని, ఫన్ 88 యాప్ లో బెట్టింగ్ ఆడి 83 లక్షలు పోగొట్టుకున్నానని ఓ వ్యక్తి మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ లపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఆహాలో స్ట్రీమ్ అయ్యే అన్ స్టాపబుల్ షో చూసి ఫన్ 88 బెట్టింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నానని, ఈ యాప్ లో బెట్టింగ్ ఆడి 83 లక్షలు పోగొట్టుకున్నానని వాపోతున్నాడు బాధితుడు. మొదటిసారి రూ. 10వేలు పెట్టగా 18వేలు వచ్చాయని, అలా వస్తూ పోతూ రూ. 3లక్షల దాకా సంపాదించానని, అప్పులు కట్టేశానని చెబుతున్నాడు బాధితుడు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు