Friday, 7 August 2026

Green Card ధరఖాస్తుదారులకు ట్రంప్ మరో షాక్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై మరింత కఠిన ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే Green Card ధరఖాస్తుదారులకు పలు కఠిననియమాలు అమలులో ఉన్న నేపథ్యంలో, తాజాగా ట్రంప్ సర్కార్ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌పై దృష్టి పెట్టింది.

Green Card, 1B Visa దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల (USCIS) అధికారులతో పంచుకోవాలి. ధరఖాస్తుదారుల గత పదేళ్ల సోషల్ మీడియా ప్రొఫైల్ చరిత్రను సమర్పించాల్సి ఉంటుంది. అమెరికాలో ఇప్పటికే ఉన్న గ్రీన్ కార్డుదారుల భవిష్యత్తు అనిశ్చితం. గ్రీన్ కార్డు కలిగి ఉన్నవారికి శాశ్వత నివాస హక్కు గ్యారంటీ కాదని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ఎప్పుడైనా వారి గ్రీన్ కార్డు హక్కును సమీక్షించి రద్దుచేయవచ్చని వెల్లడించింది.

మెరుగైన గుర్తింపు ధృవీకరణ, పరిశీలన, జాతీయ భద్రతా స్క్రీనింగ్ కోసం సోషల్ మీడియా ఖాతాల పరిశీలన అవసరమని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. విదేశీ ఉగ్రవాదులు, ఇతర జాతీయ భద్రత, ప్రజా భద్రతా బెదిరింపుల నుండి అమెరికాను రక్షించడం అనే ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాన్ని పాటించడంలో భాగంగా ఇలా గ్రీన్ కార్డు దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ కోరుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అయితే ప్రజలు మాత్రం ఇది తమ వాక్ స్వాతంత్య్రంపై దాడిగా దీన్ని భావిస్తున్నట్లు తాజా సర్వే తెలిపింది. అమెరికాలో ఇప్పటికే ఉంటున్న గ్రీన్ కార్డుదారుల్ని ఏదో విధంగా టార్గెట్ చేస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా గ్రీన్ కార్డులు తీసుకునే వారు సైతం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఇవ్వాల్సిందేనని ఆంక్షలు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినా ట్రంప్ సర్కార్ ఇవేవీ పట్టించుకునేందుకు సిద్దంగా లేదు. ఇమ్మిగ్రేషన్ వర్గాలకు ఇచ్చిన అపరిమిత అధికారాల నేపథ్యంలో తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ దుర్వినియోగం అవుతాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు