Friday, 7 August 2026

హైదరాబాద్ MMTS అత్యాచారయత్నం ఘటనలో పోలీసుల అదుపులో నిందితుడు

అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువతి ఈనెల 23న సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు వెళ్లేందుకు MMTS ట్రైన్‌లోకి ఎక్కగా, ఒంటరిగా ఉన్న ఆమెపై ఓ దుండగులు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కదులుతున్న ట్రైన్ నుంచి ఆమె కిందకు దూకగా, తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై ప్రతిపక్ష BRS నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అత్యాచార ఘటనపై కీలక అప్డేట్ వ్చచింది. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

MMTS ట్రెయిన్‌లో అత్యాచారయత్నం కేసును పోలీసులు ఛేదించారు. అమ్మాయిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన జంగం మహేష్ అనే యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంన్న మహేష్, గంజాయికి బానిసై నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈనెల 23న MMTS ట్రైన్ ఎక్కిన మహేష్ ఒంటరిగా ఉన్న అమ్మాయిపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. అతడి బారి నుంచి తప్పించుకునే క్రమంలో ట్రైన్ నుంచి దూకి ఆమె తీవ్రంగా గాయపడింది. మహేష్‌ ఫోటోను ట్రీట్‌మెంట్ తీసుకుంటుంన్న అమ్మాయికి చూపించగా నిందితుడు అతడే అని గుర్తించింది. దీంతో పోలీసులు మహేష్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

కాగా ఈ కేసుపై రైల్వే పోలీస్ SP చందన దీప్తి స్పందించారు. సోమవారం బాధితురాలిని పరామర్శించిన SP, అనంతరం మీడియాతో మాట్లాడారు. మహిళల కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కిన దుండగుడు ఒంటరిగా ఉన్న బాధిత యువతి వద్దకు వచ్చి ఆమెను గట్టిగా పట్టుకున్నట్లు చెప్పారు. అనంతరం ఆమెను తన గదికి రావాలని కోరగా, ఒప్పుకుంటే వదిలేస్తాడేమో అని భావించి ఆమె సరే అన్నట్లు తెలిపారు. అప్పటికి వదిలేసినప్పటికీ, తనను ఏమైనా చేస్తాడేమోనన్న భయంతో రన్నింగ్ ట్రైన్ నుంచి దూకినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందుతోందని ప్రాణాలకు ఎటువంటి ప్రమాదంలేదని డాక్టర్లు తెలిపినట్లు SP చందన దీప్తి తెలిపారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు