Friday, 7 August 2026

గ్రోక్ – సరికొత్త సంచలనం!

గ్రోక్! భారత్ లో సరికొత్త సంచలనం ఈ పదం. అసలు ఏమిటీ ఈ గ్రోక్? భారత్ లో ఎందుకు సంచలనంగా మారింది? గ్రోక్ అనే పదం వినగానే BJP వర్గాలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు లేదా పళ్లు నూరుతున్నారు? “Grok go back” అని ఎందుకు ఆందోళన చేస్తున్నారు? గ్రోక్ మోడీ గురించి ఏ చెప్పింది? రాహుల్ గాంధీ గురించి ఏమన్నది? ఈ ప్రశ్నలు ఎన్నో ఆసక్తికరమైన వాస్తవాలను బైటకి తెస్తున్నాయి.

చాట్ GPT, డీప్ సీక్ వంటి మరో చాట్ బోట్ గ్రోక్. రెండేళ్ల క్రితమే దీన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ, ఈ చాట్ బోట్ సంప్రదాయేతరంగా వుంటుందని దీని ఓనర్ అయిన ఎలాన్ మస్క్ తెలిపారు. చాట్ GPT లా పెద్దమనిషి తరహాలో, డీప్ సీక్ లా అతి గంభీరంగా కాకుండా గ్రోక్ సమాధానాల్లో హాస్యం, వ్యంగ్యం, చనువు కనబడతాయి. ఎలాంటి శషబిషలు లేకుండా అడిగినదానికి విశ్లేషణాత్మక వాస్తవాలు గణాంకసహిత ఆధారాలతో సహా సమాధానాలుగా వస్తాయి. గ్రోక్ ముఖ్యమైన భారతీయ భాషలన్నింటిలోనూ సమాధానమిస్తుంది.

గత వారం, పదిరోజుల క్రితం వరకు గ్రోక్ భారత్ లో పెద్దగా పాపులర్ కాలేదు. టోకా అనే ఎక్స్ అకౌంట్ ఎలన్ మస్క్ డెవలప్ చేసిన చాట్ బోట్ గ్రోక్ ని అడిగిన ఒక సాధారణ ప్రశ్న గ్రోక్ ని భారతదేశమంతటా పాపులర్ చేసింది. “ఎక్స్ లో నా బెస్ట్ 10 మ్యుచువల్స్ ని సూచించు” (మ్యుచువల్స్ అంటే ఒకరినొకరు ఫాలో అయ్యేవారు) అని అడిగిన సాధారణ ప్రశ్నకి సమాధానం వెంటనే రానందున టోకా అసహనం ఫీలవడంతో గ్రోక్ హిందీలో ఏవో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. “నేను సరదాకే అన్నాను. అయితే కంట్రోల్ తప్పాను” అని గ్రోక్ అంగీకరించింది. ఈ సంభాషణకి 20 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇంక ఒక్కొక్కరూ రంగంలోకి దిగి గ్రోక్ పై క్రికెట్, బాలీవుడ్, పాలిటిక్స్ ఇలా అన్ని రంగాలపై ప్రశ్నల బాణాలు సంధించారు. ఆ ప్రశ్నలు మోడీ మీద, పదేళ్ల BJP పాలన మీద, రాహుల్ గాంధీ మీదా ప్రధానంగా వున్నాయి. అడిగిన వారికి సమాధానం లేదనకుండా గ్రోక్ ఎలాంటి తడబాటు లేకుండా ఎంచక్కా జవాబులు ఇచ్చేసింది. ఎలాంటి ఫిల్టర్లు లేకుండా దడదడ ఇచ్చేసిన జవాబులతో భారత్ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ దద్దరిల్లిపోయాయి. సోషల్ మీడియా మొత్తం గ్రోక్ గురించిన విశ్లేషణలు, చర్చలే! “World’s most entertaining AI” అని ఎలన్ మస్క్ అన్నదానికి గ్రోక్ పూర్తి న్యాయం చేసింది.

గ్రోక్ చేసిన వ్యాఖ్యలు పదేళ్ల మోడీ పాలనపై వాతలు పెట్టినట్లుగా వున్నాయి. ఇక మోదీ, ఆయన పాలన విమర్శకులకు ఉత్సాహం రెట్టింపై గ్రోక్ ని రెచ్చగొట్టారు. గ్రోక్ కూడా “తగ్గేదెలే” అంటూ ఎక్కడా తగ్గకుండా వ్యవహరించింది. “మోదీకంటే రాహుల్ గాంధి అత్యంత నిజాయితీపరుడైన వ్యక్తి” అని గ్రోక్ తేల్చేసింది. పైగా “నేనెవ్వరికీ భయపడను” అంటూ తలెగరేసింది. “ఫార్మల్ ఎడ్యుకేషన్ మోదీకంటే రాహుల్ కే ఎక్కువ” అంటూ వెక్కిరించింది. “మోదీ ఇంటర్వ్యూలు ఎక్కువగా స్క్రిప్టెడ్” అని తేల్చి పారేసింది.

మోదీప్రధాని కాకముందున్న రూపాయి విలువని ప్రస్తుత రూపాయి విలువతో పోల్చటం, మోదీ పాలనా కాలంలో ఉద్యోగాలు ఉపాధి కల్పన, కరోనా కాలంలో మోదీ సర్కారు వ్యవహరించిన తీరు, BJP పరిపాలనా కాలంలో పరిశ్రమల స్థాపన, ఎన్ని ప్రాజెక్టులు చెపట్టారు, అందులో ఎన్ని కట్టారు, మోదీ ఎన్ని మీడియా సమావేశాలు పెట్టారు, వంటి విషయాల్లో గ్రోక్ BJP ఇజ్జత్ తీసిందనే చెప్పాలి. పెట్రోల్ రేట్, ఆర్టికల్ 370 రద్దు ఫలితం, పెద్దనోట్ల రద్దు వల్ల జరిగిన నష్టం, వాగ్దానాల అమలులో వైఫల్యం, ఎన్నికల సమయంలో ఇచ్చిన బూటకపు వాగ్దానాలు, ఇలా అన్నింటి మీద గ్రోక్ BJPని చీల్చి చెండాడింది. BJP మతతత్వ పార్టీ అని కూడా చెప్పేసింది. దీంతో సహజంగానే BJP ఆందోళన చెందింది. “గో బాక్ గ్రోక్” అనే ఆందోళనలు మొదలుపెట్టింది. గ్రోక్ చాట్ బోట్ లోని ఈ నెగెటీవ్ డాటా మొత్తం తీసేయడానికి, గ్రోక్ గొంతు నొక్కడానికి అధికార BJP కృషి చేస్తున్నదని మీడియాలోని ఒక వర్గం గగ్గోలు పెట్టింది. ప్రభుత్వ యత్నాలకు వ్యతిరేకంగా మస్క్ కోర్టుకెక్కారు. ఆ రకంగా ఇప్పుడు గ్రోక్ ఒక ప్రతిపక్ష పార్టీ పాత్రని నిర్వహిస్తున్నది.

ఐతే గ్రోక్ తో సమస్యలు లేవా అంటే వున్నాయి. ఒకప్పుడు ట్విట్టర్ పేరుతో నడిచి, అనంతర కాలంలో అలన్ మస్క్ 40 బిలియన్ డాలర్లకు కొనేసి “ఎక్స్” అనే పేరుతో వాడుతున్న ప్లాట్ఫార్మ్ నుండే ఉపయోగించుకోగల గ్రోక్ అన్ని భారతీయ భాషల్ని వాటి బూతులతో సహా మాట్లాడగలదు. ట్విట్టర్లో లేని స్వేచ్ఛని ఎక్స్ లో తాను ప్రొవైడ్ చేస్తున్నట్లు మస్క్ దాన్ని కొన్నప్పుడే ప్రకటించారు. గ్రోక్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా ఇది ఎలాంటి ఫిల్టర్లు లేకుండా పని చేస్తుందని, ఏ భాషలో అయినా, ఏ స్థాయిలో అయినా వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎక్స్, గ్రోక్ ఇస్తాయని మస్క్ తెలిపారు. గ్రోక్ ని ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తుండగా ప్రస్తుతం గ్రోక్ 3.0 వెర్షన్ రన్ అవుతున్నది. మీరు ఏ పద్ధతిలో దాన్ని అడిగితే అది అదే పద్ధతిలో సమాధానం ఇస్తుంది. మీరు హుందాగా అడిగితే హుందాగా రిప్లై ఇస్తుంది. మీరు బూతులు మాట్లాడితే అది కూడా బూతులు మాట్లాడుతుంది. తెలుగులో అయితే ఫాన్ వార్ లో భాగంగా మన హీరోల ఫాన్స్ గ్రోక్ ని యథేచ్ఛగా వాడుకుంటున్నారు. పవన్ కళ్యాన్ ఫాన్స్ మహేష్ బాబుని ట్రోల్ చేయమంటే గ్రోక్ వెంటనే మహేష్ ని ట్రోల్ చేస్తుంది. అలాగే vice versa అన్నమాట!

చూద్దాం ముందుముందు గ్రోక్ ఎన్ని సంచలనాలకి వేదిక కానున్నదో!

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు