Sarah Everard తల్లిదండ్రులు, తీవ్రమైన హింస మరియు లైంగిక నేరాలకు కఠిన శిక్షలు వేయాలని కోరుతున్నారు.
దీనికోసం పార్లమెంట్లో ఓ కొత్త ప్రచార సమితిని ప్రారంభిస్తున్నారు. దానిపేరు “Justice for Victims.”
అసలు విషయం ఏమిటంటే..
Sarah Everard అనే మహిళ United Kingdom (UK) లోని London లో ఉండే ఓ సాధారణ యువతి. వయసు 33 సంవత్సరాలు. ఆమె ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్.
2021 మార్చి 3వ తేదీన రాత్రి Sarah Everard ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆమెను Wayne Couzens అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అతను ఎవరో కాదు, ఒక పోలీసు అధికారి (Metropolitan Police Officer).
అతను ఆమెను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, చివరికి హత్య చేశాడు. ఇది బ్రిటన్ మొత్తాన్ని కదిలించిన కేసు.ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరగడం, మహిళల భద్రతపై పెద్ద చర్చలు రావడం జరిగింది. కోర్టు అతనికి జీవితాంతం జైలుశిక్ష (Whole Life Order) విధించారు.
“మా కుమార్తెని చంపిన హంతకుడికి జీవితాంతం జైలు శిక్ష విధించడం వల్ల మాకు కొంత ఊరట కలిగింది. ఇది అతని నేరం ఎంత దారుణమైనదో ప్రపంచానికి చెప్పింది. కానీ అలాంటి శిక్షలు అందరికీ లభించవు. చాలా కుటుంబాలు ఆ అవకాశం కోల్పోతుంటారు.” అని Sarah తల్లిదండ్రులు అన్నారు.
ఈ ఉద్యమంలో మరో సభ్యురాలు Paula Hudgell. ఆమె, Tony అనే చిన్న బాలుడిని దత్తత తీసుకున్నారు. అతను పుట్టిన వెంటనే తల్లిదండ్రుల చేత వేధింపులకు గురై రెండు కాళ్లు కోల్పోయాడు.
Tony జస్ట్ 41 రోజుల వయసులో ఉన్నప్పుడు Jody Simpson మరియు Anthony Smith అనే దుర్మార్గపు తల్లిదండ్రులు అతడిని మానసికంగా, శారీరకంగా హింసించారు. బాగా కొట్టడం వల్ల ఊపిరితిత్తులు పగిలిపోయాయి. చేయి మరియు కాలు జాయింట్లలో విరుపులు వచ్చాయి. Blunt Force Trauma కారణంగా Liver Failure, Toxic shock, Sepsis వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఈ గాయాలకు 10 రోజులపాటు ఎటువంటి వైద్యసహాయం చేయకుండా అతడిని ఇంట్లోనే వదిలేశారు. ఫలితంగా అతడి రెండు కాళ్లలో రక్తప్రసరణ ఆగిపోయి, Necrosis (కాళ్లు చచ్చుబడిపోయి) ఏర్పడి, వైద్యులు తప్పనిసరిగా కాళ్లను పూర్తిగా తీసివేయాల్సి వచ్చింది. Tony కి ఈ దుస్థితిని కలిగించిన తల్లిదండ్రులకు 2018లో 10 ఏళ్ల జైలు శిక్ష వేసారు.
Paula Hudgell మాట్లాడుతూ.. “పిల్లలపై హింస చేస్తే జీవితాంతం దాని ప్రభావం వారిమీద ఉంటుంది. కానీ నేరస్థులు కొన్నేళ్లకే బయటికి వచ్చేస్తున్నారు. ఇది నిజంగా అన్యాయమే. న్యాయవ్యవస్థ దీనికి తగిన తీర్పు ఇవ్వాలి. పిల్లల్ని హింసించినవారు, హత్య చేసినవాళ్లు మరొకసారి బయటకి రావడం అనేది జరగొద్దు.” అని ఆమె అన్నారు.
ఈ గ్రూప్లో మరికొంతమంది బాధితుల కుటుంబాలు కూడా ఉన్నారు:
- Violet-Grace Youens (4 ఏళ్ల చిన్నారి): 80 km/hr వేగంతో నడిపిన డ్రైవర్ చేతిలో ప్రాణాలు కోల్పోయింది.
- Mihrican Mustafa (Janగా ప్రసిద్ధి): 2018లో ఓ దోషిగా జైలుకెళ్లిన వ్యక్తిచేతిలో హత్యకు గురైంది. ఆమె శవం ఏడాది తర్వాత ఫ్రీజర్లో కనిపించింది.
Sasha Marsden (16 ఏళ్ల యువతి): 2013లో చంపబడి, ఆమె అక్క Katie Brett ఇప్పటికీ న్యాయం కోసం పోరాటం చేస్తోంది.
- Violet-Grace Youens (4 ఏళ్ల చిన్నారి): 80 km/hr వేగంతో నడిపిన డ్రైవర్ చేతిలో ప్రాణాలు కోల్పోయింది.
Katie మాట్లాడుతూ.. “మా చెల్లెలు ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న యువతి. నేరస్తులు 15 – 20 ఏళ్లలో జైలు నుండి బయటపడుతున్నారు. నిజంగా జీవితాంతం శిక్ష అనేది బాధిత కుటుంబాలకే వర్తిస్తుంది.” అని ఆవేదన వ్యక్తం చేశారు.
బ్రిటన్ న్యాయ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ… “బాధితులకు న్యాయం అందించడమే మా ప్రాధాన్యత మరియు మా బాధ్యత. న్యాయవ్యవస్థ పనితీరుపై సమీక్ష మొదలైంది..” అని వెల్లడించింది.
ఈ కొత్త గ్రూప్ బుధవారం రోజున అనేక పార్టీలు, ప్రతిపక్ష నేతలతో సమావేశమై తన డిమాండ్లను వివరించనుంది. “నేరం తీవ్రతకు తగిన శిక్షలే సమాజంలో న్యాయాన్ని నిలబెట్టగలవు” అని ఈ గ్రూప్ స్పష్టం చేస్తోంది.