Friday, 7 August 2026

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ఆక్రమించలేదు: మంత్రి శ్రీధర్ బాబు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని 2003లో క్రీడా సౌకర్యాల అభివృద్ధి పేరిట IMG అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించిందని రాష్ట్ర IT, పరిశ్రమల శాఖమంత్రి శ్రీదర్ బాబు తెలిపారు. ఆ సంస్థ ప్రాజెక్టును ప్రారంభించలేదని, 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించి కేటాయింపును రద్దు చేసిందని తెలిపారు. మంగళవారం కంచ గచ్చిబౌలిలోని సర్వే నెం.25లో ఉన్న 400 ఎకరాల భూమి గురించి వచ్చిన ప్రచారం వక్రీకరించేలా ఉందని ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వివరిస్తూ ఐఎంజీ అకాడమీస్ ఈ కేటాయింపు రద్దుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా 07 మార్చి 2024న హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.

దానిపై ఆ సంస్థ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసిందని, 03 మే 2024న సుప్రీం కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసిందని తెలిపారు. శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్లు రెవెన్యూ రికార్డుల ఆధారంగా ఈ 400 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా ధృవీకరించారని, ఈ భూమికి అటవీ శాఖకు ఏ సంబంధం లేదని, ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి అని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఈ 400 ఎకరాల భూమిని కొత్త భూ కేటాయింపు విధానం ప్రకారం TGIIC కి కేటాయించడానికి రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ అప్పగించింది. TGIIC అభివృద్ధి చేస్తున్న 400 ఎకరాల భూమిలో బఫెలో లేక్, పికాక్ లేక్లు లాంటి ప్రకృతి ప్రదేశాలు లేవని స్పష్టం చేసిందన్నారు. TGIIC హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూమిని ఆక్రమించలేదని, అలాగే నీటి వనరులను రాతి నిర్మాణాలను తొలగించలేదన్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు