Friday, 7 August 2026

తెలంగాణకు చైనా విద్యుత్తు కార్ల దిగ్గజ సంస్థ BYD?

తెలంగాణ రాష్ట్రానికి చైనా విద్యుత్తు కార్ల దిగ్గజసంస్థ BYD హైదరాబాద్ సమీపంలో విద్యుత్తు కార్ల యూనిట్ స్థాపించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంస్థ కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు సాగిస్తూ ఇటీవల తుదినిర్ణయాన్ని తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమి కేటాయించడంతో పాటు, అన్నిరకాలుగా మద్దతు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ పరిసరాల్లో యూనిట్ ఏర్పాటుకు అనువైన మూడు ప్రదేశాలను BYD కి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మూడింటినీ ఆ సంస్థ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. ప్రదేశంపై తుది నిర్ణయానికి రాగానే, ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది.

దీంతో పాటు విద్యుత్తు కార్ల విడిభాగాలు ఉత్పత్తి చేసే అనుబంధ యూనిట్లూ దీనికి సమీపంలో ఏర్పాటయ్యే అవకాశాలుంటాయి. తద్వారా విద్యుత్తు వాహనాల క్లస్టర్ హైదరాబాద్ సమీపంలో రూపుదిద్దుకున్నట్లు అవుతుంది. BYD కొన్నేళ్లుగా భారత్ లో కార్యకలాపాలు సాగిస్తున్నా, ఇక్కడ సొంత యూనిట్లు లేవు. ప్రస్తుతం BYD విద్యుత్తు కార్లను చైనా నుంచి మనదేశానికి తీసుకువచ్చి విక్రయిస్తోంది. ఇందుకోసం అధిక దిగుమతి సుంకాలు చెల్లించాల్సి రావడంతో, ప్రస్తుతం ఈ కార్ల ధర ఎక్కువగా ఉంది. ఫలితంగా ఆశించిన రీతిలో అమ్మకాలు చేయలేకపోతోంది. విద్యుత్తు కార్లను మనదేశంలో ఉత్పత్తి చేస్తే ధర తగ్గుతుంది. తద్వారా అమ్మకాలు గణనీయంగా పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.

మనదేశంలో సొంత యూనిట్ ఏర్పాటు చేసేందుకు రెండేళ్లుగా BYD కసరత్తు చేస్తోంది. కాకపోతే చైనా పెట్టుబడులను అనుమతించే విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉండటంతో ఇప్పటివరకు సాధ్యం కాలేదు. తాజాగా కేంద్రప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించడంతో, BYD ప్రాజెక్టుకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా విద్యుత్తు బస్సుల కార్యకలాపాలు సాగిస్తున్న MEIL గ్రూపు సంస్థ ఒలెక్ట్రాగ్రీన్ టేక్ తో ఎన్నో ఏళ్లుగా BYD కి సాంకేతిక భాగస్వామ్యం ఉంది. BYD టెక్నాలజీతోనే విద్యుత్తు బస్సులను ఉత్పత్తి చేసి, దేశవ్యాప్తంగా ఒలెక్ట్రాగ్రీన్ టెక్ సరఫరా చేస్తోంది. తన విద్యుత్తు కార్ల యూనిట్ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రాన్ని BYD ఎంచుకోడానికి ఇదీ ఒక కారణమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు