Friday, 7 August 2026

భారత్‌లో 2,000 వీసా అపాయింట్‌మెంట్లు రద్దు – మోసాలను అరికట్టేందుకు అమెరికా చర్య

అమెరికా ఫస్ట్‌ అన్న నినాదంతో ముందుకు సాగుతోన్న ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మోసపూరిత కార్యకలాపాలను అడ్డుకునేందుకు అమెరికా దౌత్య కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా భారత్‌లో 2,000 వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేసినట్లు బుధవారం వెల్లడించింది. అవి అక్రమ పద్ధతుల్లో, ప్రత్యేకంగా ‘బాట్స్‌’ ద్వారా బుక్‌ చేసినట్లు గుర్తించామని తెలిపింది. అపాయింట్‌మెంట్‌ షెడ్యూలింగ్‌ వ్యవస్థలో భారీ లోపం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

వీసా అపాయింట్‌మెంట్ల కోసం ధరఖాస్తుదారులు నెలల తరబడి ఎదురు చూస్తుండగా, కొన్ని ఏజెంట్లు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ టూల్స్ (బాట్స్) ఉపయోగించి స్లాట్లను ముందుగానే బుక్‌ చేసుకుంటున్నారు. చట్ట వ్యతిరేక విధానాన్ని అడ్డుకునేందుకు అమెరికా కాన్సులర్‌ బృందం ఈ చర్యలు తీసుకుంది.

తమ షెడ్యూలింగ్‌ విధానాలను ప్రభావితం చేసే ఏజెంట్లను, ఫిక్సర్లను ఏమాత్రం సహించమని అమెరికా దౌత్యకార్యాలయ అధికారులు చెబుతున్నారు. ఈ 2,000 అపాయింట్‌మెంట్లను రద్దు చేయడమే కాకుండా, వాటికి అనుబంధ ఖాతాలను కూడా సస్పెండ్‌ చేస్తున్నామన్నారు. వీసా దరఖాస్తు ప్రక్రియను పారదర్శకంగా ఉంచడానికి మోసపూరిత కార్యకలాపాలను నిర్మూలించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని ప్రకటించారు.

భారతదేశంలో అమెరికా బిజినెస్‌, విజిటర్‌ (B1, B2), స్టూడెంట్‌ వీసాలకు అపాయింట్‌మెంట్‌ పొందేందుకు సుదీర్ఘ Waiting Time ఉంటుంది. అయితే ఏజెంట్ల ద్వారా ప్రాసెస్ చేస్తే, రూ.30,000 నుంచి రూ.35,000 వరకు చెల్లించి నెల రోజుల్లోనే అపాయింట్‌మెంట్‌ పొందడం సాధ్యమవుతుంది. ఈ విధానంలో ఏజెంట్లు ప్రత్యేక బాట్స్‌ను ఉపయోగించి వీసా స్లాట్లను ముందుగానే బుక్‌ చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి తన కుమారుడు అమెరికాలోని విశ్వవిద్యాలయంలో చేరేందుకు స్వయంగా వీసా అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించగా అది సాధ్యం కాలేదని, అదే ఏజెంటుకు రూ.30,000 చెల్లించగానే వెంటనే అపాయింట్‌మెంట్‌ లభించిందని ఓ ప్రముఖ ఆంగ్ల వార్తా పత్రికకు వెల్లడించాడు.

2023లో B1, B2 వీసా అపాయింట్‌మెంట్లకు 999 రోజుల వేటింగ్‌ పీరియడ్‌ నమోదయ్యింది. దీంతో భారతీయ ధరఖాస్తుదారుల కోసం ఫ్రాంక్‌ఫర్ట్‌, బ్యాంకాక్‌ వంటి నగరాల్లో వీసా అపాయింట్‌మెంట్లు తెరవాల్సిన పరిస్థితి వచ్చింది. భారత ప్రభుత్వం ఈ సమస్యను అమెరికా దృష్టికి తీసుకెళ్లిన తర్వాత, అక్కడి అధికారులు వీసా వెయిటింగ్‌ సమయాన్ని గణనీయంగా తగ్గించారు. తాజా పరిణామంలో, బాట్స్‌ ద్వారా అక్రమంగా స్లాట్లను బుక్‌ చేసే మోసాలను అడ్డుకోవడంపై దృష్టిపెట్టినట్లు స్పష్టమైంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు