Friday, 7 August 2026

ACB వలలో విద్యుత్ శాఖ AE…

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం బౌరంపేటకు చెందిన ప్రసాద్‌. 11KV విద్యుత్‌ లైన్‌ను పక్కకు మార్చడానికి దుండిగల్‌ మునిసిపాలిటీలోని దొమ్మర పోచంపల్లి సబ్‌స్టేషన్‌ AE సురేందర్‌రెడ్డిని సంప్రదించారు. జీడిమెట్ల డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎలక్ట్రికల్ AE AS.సురేందర్ రెడ్డి దొమ్మర పోచంపల్లి సబ్ డివిజన్‌లో పని చేస్తున్నాడు. దొమ్మర పోచంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని బౌరంపేటకు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన 11KV లైన్ షిఫ్టింగ్ కోసం ఎస్టీమేషన్ వేసేందుకు 30 వేలు రూపాయల లంచం ఆశించడంతో బాధితుడు ACB అధికారులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదుతో గురువారం 2:45 నిమిషాలకు అవినీతి నిరోధక శాఖ సిటీ రేంజ్ యూనిట్-2 DSP పి.శ్రీధర్ నేతృత్వంలో D.పోచంపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో దాడులు నిర్వహించిన ACB అధికారులు బాధితుని దగ్గర నుండి 30 వేలు లంచం తీసుకొని కుడిచేతి ద్వారా ప్యాంట్ జేబులో పెట్టుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

సదరు AE సురేందర్ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా దొమ్మర పోచంపల్లి సబ్ డివిజన్‌లో విధులు నిర్వహిస్తూ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అతనిని అరెస్ట్ చేసిన అధికారులు విచారణ నిమిత్తం నాంపల్లి ACB కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా ACB అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం రహస్యంగా ఉంచుతామన్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు