Friday, 7 August 2026

పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో సమగ్ర విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం!

ఈ నెల 24న రాజమండ్రి సమీపంలో కొంతమూరు వద్ద మోటార్ సైకిల్ పై వెళుతూ అనుమానాస్పదంగా మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల భౌతిక కాయానికి క్రైస్తవ సంఘాల ఆందోళనలు ఉద్రిక్తతల మధ్య, కుటుంబ సభ్యుల సమక్షంలో వీడియో తీస్తుండగా పోస్ట్ మార్టం మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు మొదలై రెండున్నర గంటలపాటు జరిగింది. అనంతరం ప్రవీణ్ భౌతిక కాయాన్ని అంబులెన్సులో హైదరాబాద్ పంపటానికి పోలీసులు ప్రయత్నించగా, ప్రభుత్వ స్పందన లేకుండా హైదరాబాద్ కి భౌతికకాయాన్ని తీసుకెళ్లడాన్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. కానీ పోలీసులు ఆందోళనకారులను చెదరకొట్టి హైదరాబాద్ కి తరలించారు.

కాగా క్రైస్తవ సంఘాల ఆందోళనలకు ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవీణ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో ఆయన అన్ని కోణాల్లో సమగ్ర విచారణకి ఆదేశించారు. తానే స్వయంగా DGP హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేయిస్తామని మంత్రి నారా లోకేష్, పారదర్శక విచారణ చేయిస్తామని హోంమంత్రి అనిత కూడా ప్రకటించారు.

గత మూడు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న క్రైస్తవ సంఘాలు, ఒక సమగ్ర విచారణకు ప్రభుత్వం నుండి సానుకూల స్పందనని రాబట్టడంలో సఫలం అయ్యాయని చెప్పక తప్పదు. దర్యాప్తులో పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకం కానున్నందున ఆ రిపోర్ట్ కోసం ఈ విషయాన్ని ఫాలో అయ్యేవారు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు