మియాపూర్ పోలీసులు తనపై నమోదు చేసిన FIR కొట్టేయాలంటూ విష్ణుప్రియ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారించింది. FIR కొట్టేసేందుకు, అలాగే ఈ దర్యాప్తుపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది.
అంతేకాకుండా, ఈ కేసులో పోలీసులకు సహకరించాలని విష్ణు ప్రియను హైకోర్టు ఆదేశించింది. అలాగే చట్టప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. బెట్టింగ్ యాప్ ల పై ప్రచారం చేసిన పలువురు నటులు, ఇన్ఫ్లూయన్సర్ల పై మియాపూర్ తో పాటు పంజాగుట్ట పోలీసులు పలు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా పలువురు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. బెయిల్ పొందేందుకు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.