Friday, 7 August 2026

తెలంగాణ కాంగ్రెస్ MLA కుటుంబానికి బ్యాంకాక్ లో భయంకరమైన అనుభవం

బ్యాంకాక్ కపంలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ MLA కుటుంబానికి భయంకరమైన అనుభవం ఎదురైంది. ఒక వివాహ విందుకు హాజరయ్యేందుకు రామగుండం MLA రాజ్‌ ఠాకూర్‌ భార్య మానాలి, కుమార్తె మానస, కుమారులు ప్రతీక్, నిధీశ్‌ రెండు రోజుల క్రితం బ్యాంకాక్‌ వెళ్లారు. బ్యాంకాక్ నగరంలోని నోవాటెల్‌ హోటల్‌లో వీరు నివాసం ఉన్నారు. హోటల్ మెుత్తం 38 అంతస్తులలో ఉండగా, 35వ అంతస్తులో రూం తీసుకున్నారు. అయితే శుక్రవారం ఉదయం ఉన్నట్టుండి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ వివరాలను ఆమె మీడియాతో షేర్ చేసుకున్నారు.

హోటల్ గదిలో ఉండగానే పెద్దగా కేకలు వినిపించాయి. కిటికీలోంచి బయటకు చూసేసరికి పక్కనే ఉన్న పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపోతూ కనిపించాయి. ఆ సమయంలో గుండె ఆగిపోయినంత పనైంది. నేను, నా పిల్లలు భయంతో గజగజ వణికిపోయాం. 35వ అంతస్తులో ఉన్న మేం మెట్ల మార్గంలో వేగంగా పరుగెత్తుకుంటూ కిందికి చేరుకున్నాం. కిందకు వచ్చే క్రమంలో హోటల్‌ పై కప్పు పెచ్చులు ఊడి కింద పడిపోయాయి. బయటకు వచ్చి చూశాక మేం నివాసం ఉన్న హోటల్ భవనం ఒకవైపు ఒరిగిపోయి కనిపించింది. ఓ దశలో మేం మా ప్రాణాలమీద పూర్తిగా ఆశలు వదులుకున్నాం. దేవుడి దయ వల్ల నాకు, నా పిల్లలకు, మాతోపాటు హోటల్‌లో నివాసం ఉన్న వారెవరికీ ఏమీ కాలేదు. అని తమ భయంకరమైన అనుభవాన్ని వెల్లడించారు. కాగా ఈ ఘటన గురించి తెలిసి షాక్‌కు గురయ్యాయని MLA రాజ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. తన కుటుంబం క్షేమంగా బయటపడినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు