Friday, 7 August 2026

క్రికెట్‌ బెట్టింగ్‌ లో 8లక్షలు పోగొట్టుకుని అప్పులు తీర్చలేక ఆత్మహత్య

గేమింగ్‌లు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడి వ్యసనంగా మారిన వందలాది మంది ప్రాణాలు పోతున్నాయి. డబ్బు ఆశ చూపి ఉన్నదంతా ఊడ్చడమే కాకుండా అప్పులు చేసి ప్రాణాలని కూడా తీసుకునేలా చేస్తున్నాయి. ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటున్నా, గేమింగ్‌లు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల అరాచకాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

ఫలితంగా బెట్టింగ్‌లు, గేమింగ్‌లతో అప్పుల ఊబిలో చిక్కుకుని యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే, కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మరో యువకుడు బలయ్యాడు. కడప రామేశ్వరానికి చెందిన ప్రేమ్‌సాయిరెడ్డి అనే యువకుడు ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌తో 8 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ అప్పులు తీర్చేందుకు దారి లేకపోవడంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. ఇంట్లోనే ఉరి వేసుకున్న కన్నకొడుకును చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రేమ్‌సాయిరెడ్డి భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

తీవ్రతరం కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్లాట్‌ఫామ్‌లపై ఉక్కుపాదం మోపుతున్నాయి. యువత ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్, గేమింగ్ యాప్‌లు, వెబ్‌సైట్ల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు