Friday, 7 August 2026

వ్యక్తుల ప్రాధమిక హక్కుల గురించి పోలీసులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి: సుప్రీం కోర్ట్

రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 ప్రకారం, రాష్ట్రంలో భాగమైన పోలీసు అధికారులు రాజ్యాంగాన్ని పాటించాల్సిన, దాని ఆదర్శాలను గౌరవించాల్సిన బాధ్యత ఉందని, శుక్రవారం (మార్చి 28) సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.

పౌరులు రాజ్యాంగాన్ని పాటించాలని, దాని సంస్థలను గౌరవించాలని ఆదేశించే ఆర్టికల్ 51A(a) గురించి ప్రస్తావిస్తూ, అధికారులు వ్యక్తుల ప్రాథమిక హక్కులను, ముఖ్యంగా ఆర్టికల్ 19(1)(a) కింద హామీ ఇవ్వబడిన వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును కాపాడాలని కోర్టు పేర్కొంది.

“ఏ ఖూన్ కే ప్యాసే బాత్ సునో” అనే కవిత నేపథ్యంలో వీడియో క్లిప్‌ను కలిగి ఉన్న తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు సంబంధించి, కాంగ్రెస్ రాజ్యసభ MP ఇమ్రాన్ ప్రతాప్‌గఢిపై గుజరాత్ పోలీసులు నమోదు చేసిన FIR‌ను కొట్టివేస్తూ, జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగం 75 సంవత్సరాలకు పైగా అమలులో ఉన్నప్పటికీ, పోలీసు అధికారులు తమ రాజ్యాంగ బాధ్యతల పట్ల తగినంతగా అవగాహన కలిగి ఉండరని కోర్టు పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం తమ బాధ్యతల గురించి, అధికారులు తెలుసుకునేలా భారీ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని, ప్రభుత్వాన్ని కోర్టు కోరింది.

సుప్రీం కోర్ట్ చేసిన పదునైన వ్యాఖ్యల్ని, ప్రభుత్వం, పోలీసులు ఎంతవరకు సీరియస్‌గా తీసుకుంటారో వేచి చూద్దాం.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు