Friday, 7 August 2026

ఇజ్రాయెల్ వ్యతిరేక, పాలస్తీనా అనుకూల నిరసనకారులపై UAPA కింద కేసు నమోదు చేసిన J&K పోలీసులు

ఖుద్స్ దినోత్సవం సందర్భంగా, ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఇజ్రాయెల్ వ్యతిరేక, పాలస్తీనా అనుకూల నిరసనలు చెలరేగడంతో, జమ్మూ కాశ్మీర్ పోలీసులు శుక్రవారం (మార్చి 28) UAPA చట్టం కింద గుర్తుతెలియని నిరసనకారులపై కేసు నమోదు చేశారు. బీర్వాలో జరిగిన ఇలాంటి నిరసనకు సంబంధించి, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 126(2) (తప్పుడు నిర్బంధం), 189(6) (చట్టవిరుద్ధ సమావేశం) కింద బుద్గాం జిల్లా పోలీసులు ప్రత్యేక కేసు నమోదు చేశారు.

కొనసాగుతున్న ఇస్లామిక్ మాసం రంజాన్ చివరి శుక్రవారం నాడు, జరుపుకునే ఖుద్స్ దినోత్సవాన్ని కాశ్మీర్, లడఖ్‌లోని వివిధ ప్రాంతాలలో, పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక, అమెరికా వ్యతిరేక నిరసనలు జరిగాయి. దీనికి మహిళలు, పిల్లలతో సహా వేలాది మంది హాజరయ్యారు. బారాముల్లా జిల్లాలోని పట్టన్ ప్రాంతంలోని చైనబాల్‌లో జరిగిన అలాంటి ఒక నిరసన కార్యక్రమంలో, కొంతమంది ప్రదర్శనకారులు హిజ్బుల్లా జెండాలను ఊపుతూ కనిపించగా, మరికొందరు గత సంవత్సరం హత్యకు గురైన లెబనీస్ మతాధికారి, హిజ్బుల్లా కమాండర్ హసన్ నస్రల్లా ఫోటోలను కలిగి ఉన్న ప్లకార్డులు, బ్యానర్‌లను ప్రదర్శించారు. గత సంవత్సరం అక్టోబర్‌ లో ఇజ్రాయెల్ దళాలతో జరిగిన ఘర్షణలో మరణించిన, పాలస్తీనియన్ రాజకీయ నాయకుడు, హమాస్ మాజీ చైర్మన్ యాహ్యాసిన్వర్‌తో కూడిన ప్లకార్డులను, ఇతర నిరసనకారులు ప్రదర్శించారు.

ఈ నిరసనకు సంబంధించి, పట్టాన్ పోలీస్ స్టేషన్‌లో UAPA (FIR No 49/2025) కింద కేసు నమోదు చేసినట్లు, అధికారి తెలిపారు. అయితే, ఉగ్రవాద నిరోధక చట్టంలోని ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయబడిందో, పోలీసులు వెల్లడించలేదు. ఎక్కడో ఇజ్రాయెల్, పాలస్తీనాకి సంబంధించిన విషయంలో, ఇక్కడ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తే, అది ఉగ్రవాదమెలా అవుతుందో, పోలీసులు, ప్రభుత్వం వివరించాలి. శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న ప్రదర్శనకారులపై కేసు పెట్టడం, వారి వాక్ స్వాతంత్ర్యంపై జరుగుతున్న దాడిగానే భావించాలి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు