Friday, 7 August 2026

అవకాశం వస్తే మళ్లీ అంతరిక్షంలోకి!

దాదాపు తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయి, ఎటకేలకు స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా గత నెల 19న భూమ్మీదకు చేరుకున్న సునీత విలియమ్స్. తనకు అవకాశం వస్తే స్టార్‌లైనర్ ద్వారా మళ్లీ అంతరిక్షంలోకి వెళ్ళతానని అన్నారు. సునీతతో పాటు భూమ్మీదకు చేరుకున్న మరో ఇద్దరు వ్యోమగాములు బుచ్ విల్మోర్, నిక్ హేగ్ నాసా ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడారు.

సునీత మాట్లాడుతూ, తాను స్పేస్‌లో ఉన్నప్పుడు తన ఆరోగ్యం కోసం అందరూ ఆందోళన చెందారని, ఇప్పుడు తాను ఎంతో బాగున్నానని, భూమికి తిరిగి వచ్చాక మూడు మైళ్లు పరిగెత్తానని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న మిషన్ కంట్రోల్ బృందాలు తమకు భూమి పైకి తిరిగి రావడంలో, పునరావాసం మరియు కొత్త సవాళ్లను ఎదుర్కోవడంలో ఎంతో సహాయం చేశాయన్నారు. తాను నార్మల్ అవడానికి సహాయం చేసిన సహాయక బృందాలకు ఆమె కృతజ్ఞతలు తెలియచేశారు.

స్పేస్ నుండి భూమి ఎలా కనిపించిందని అడిగితే, అద్భుతంగా కనిపించిందని అన్నారు. ముఖ్యంగా హిమాలయాలు మరింత అద్భుతంగా కనిపించాయన్నారు. తన తండ్రి జన్మించిన భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని, భారత్ మూలాలు కలిగి ఉండడం వల్ల గర్వంగా ఉందని తెలిపారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు