Friday, 7 August 2026

తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశంలో ట్విస్ట్?

 

త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండాలని వార్తలు వస్తున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేబినెట్ విస్తరణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలకు కేబినెట్‌లో ప్రాతినిథ్యం కల్పించాలని కోరుతూ, కాంగ్రెస్ హైకమాండ్‌కు లేఖ రాశారు ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌కు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయంతో పార్టీకి, ప్రజలకు మేలు జరుగుతుందని తన లేఖలో ప్రస్తావించారు జానారెడ్డి.

కేబినెట్ విస్తరణ అంశంపై ఉన్నట్టుండి జానారెడ్డి హైకమాండ్‌కు లేఖ రాయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి కేబినెట్‌లో ప్రాతినిథ్యం లేకపోవడాన్ని ఇబ్రహీంపట్నం MLA మల్ రెడ్డి రంగారెడ్డి అనేకసార్లు బహిరంగంగానే ప్రస్తావించారు. ఈ కోటాలో తనకు కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు చోటు దక్కుతుందా, లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.

కేబినెట్‌లో 6 ఖాళీలు ఉండగా, ప్రస్తుతం నాలుగు స్థానాలను భర్తీ చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ 4 కోసం సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి పోటీపడుతున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల వారికి అవకాశం ఇస్తే, మల్ రెడ్డి రంగారెడ్డికి ఛాన్స్ ఉంటుందని, అదే జరిగితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉండకపోవచ్చనే టాక్ ఉంది.

అయితే అనేక సామాజిక, రాజకీయ కోణాల్లో లెక్కలు వేసుకున్న తరువాత కేబినెట్ విస్తరణ ఉంటుంది. కాబట్టి తుది జాబితాలో ఎవరికి అవకాశం ఉంటుందో చెప్పడం కష్టమే అని పలువరు అభిప్రాయపడుతున్నారు. అయితే కేబినెట్ విస్తరణకు ముహూర్తం దగ్గరపడిందనే సమయంలో జానారెడ్డి వంటి సీనియర్ నేత లేఖ రాయడం కీలక పరిణామమనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు