Friday, 7 August 2026

జుట్టు కత్తిరించుకొని ఆశా వర్కర్ల నిరసన

కేరళలోని ఆశా వర్కర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న పద్ధతిలో నిరసన చేపట్టారు.

తాము ఎంతో ప్రేమగా పెంచుకున్న జుట్టును కత్తిరించి వారు నిరసనను వ్యక్తం చేశారు. 50 రోజులుగా తాము ధర్నా చేస్తున్నా, సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ తిరువనంతపురంలోని సెక్రటేరియెట్ ఎదుట శిరోముండనం చేసుకున్నారు. పదుల సంఖ్యలో మహిళలు జుట్టు కత్తిరించుకున్నా, మరికొంత మంది ఏకంగా గుండ్లు కొట్టించుకున్నారు. మరి వీరంతా ఎందుకు ధర్నా చేస్తున్నారు, జుట్టు కత్తిరించుకుని నిరసన తెలిపేంత సమస్య ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కేరళలోని ఆశా వర్కర్లు 50 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.

తాము రోజువారీ గౌరవ వేతనాన్ని పెంచాలని, పోస్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరుతున్నారు. ప్రతిరోజూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అస్సలే పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది. అయితే ఆశా వర్కర్లు నిరసన చేపట్టి నేటితో 50 రోజులు కావొస్తుండగా, వినూత్న పద్ధతిలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

మరికొందరు పూర్తిగా గుండ్లు కొట్టించుకుని తమ మనసులోని బాధను ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేశారు. ఆపై కత్తిరించుకున్న జుట్టు చేత పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ, రోజుకు కేవలం 232 రూపాయలతో తాము ఎలా బతకాలంటూ ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే, సెక్రటేరియెట్ ఎదుటే ప్రాణాలు వదిలేస్తామని వారు వివరించారు.


ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు